వామ్మో..బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న వాళ్లతో ఓట్లు ఇలా వేయిస్తున్నారా..? ఏం తెలివి రా బాబు..!!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు పోలింగ్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే . ఇన్నాళ్లు నువ్వా నేనా అంటూ పోటాపోటీగా క్యాంపెయినింగ్ నిర్వహించుకున్న పలు పార్టీ నేతలు ఇప్పుడు అధికారం ఎవరి చేతిలోకి రాబోతుంది..?? అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . కొంతమంది మళ్ళీ టిఆర్ఎస్ నే అధికారం చేపడుతుంది అంటూ చెప్పుకొస్తుంటే .. మరి కొంతమంది మాత్రం తెలంగాణలో ట్రెండు మారబోతుంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు.

అయితే చాలామంది వర్షం కారణంగా ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు . మరి కొంతమంది సెలవులు ఇచ్చిన కూడా ఓటు వేయకుండా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు అధికారులు ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ మైకులలో అనౌన్స్ చేస్తున్నారు . అయితే ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది . అందరికీ ఓకే మరి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పరిస్థితి ఏంటి ..??

వాళ్ళు తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి ..?? అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది. సాధారణంగా ప్రభుత్వం లేదా ఇతర ప్రత్యేక విధుల్లో భాగంగా బయటకు వెళ్లి పోలింగ్ బూత్ కి దూరంగా ఉన్నవారికి ఎలక్షన్ కమిషన్ బ్యాలెట్ ఓటింగ్ ద్వారా తమ ఓటింగ్ వేసే అవకాశం కలిపిస్తుంది . అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ కూడా అలా బ్యాలెట్ ఓటింగ్ వేసే సదుపాయం కల్పించింది ..తెలంగాణ ప్రభుత్వం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ వార్త మాత్రం తెగ ట్రెండింగా మారిపోయింది..!!