ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ నరసింహం నందమూరి బాలయ్య కొత్త దంపతులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . వరుణ్ లావణ్య రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . ఇటలీలో వీళ్ల పెళ్లి మూడు రోజులపాటు ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది . ఇండియా కూడా వచ్చేశారు .
మరికొద్ది గంటల్లో హైదరాబాద్లో రిసెప్షన్ కి హాజరు కాబోతున్నారు . అయితే నందమూరి బాలయ్య ఈ నవ దంపతులకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే గిఫ్ట్ ప్రెసెంట్ చేశారట. పుల్లలతో తయారు చేసిన వెంకటేశ్వర స్వామిని వరుణ్ లావణ్యలకు గిఫ్ట్ గా ఇచ్చారట . నాగబాబు – పద్మ – వరుణ్ – నిహారిక వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా నమ్ముతారు అని.. వాళ్ళ ఆరాధ్య దైవం అని ..
ఆయన బ్లెస్సింగ్ ఎప్పటికీ వరుణ్ – లావణ్య లకి ఉండే విధంగా స్పెషల్ గా ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోలు డిజైన్ చేయించి మరీ ఇచ్చారట. దీంతో బాలయ్య ఇచ్చిన గిఫ్ట్ వైరల్ గా మారింది. మొత్తానికి కోట్లు విలువ చేసే గిఫ్ట్స్ మెగా ఫ్యామిలీ ఇచ్చినా బాలయ్య గిఫ్ట్ ముంది బిస్కెట్ అయ్యాయి..!!