అక్కినేని అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానికి సూపర్ స్టార్ కృష్ణ కారణమా..?!

టాలీవుడ్ లో ప్రఖ్యాతిగాంచిన ప్రొడక్షన్ హౌస్ అనగానే చాలామందికి ఠ‌క్కున గుర్తుకు వచ్చేది అక్కినేని నాగేశ్వరావు నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్. ఇప్పటికీ నిత్య కళ్యాణం పచ్చ తోరణంల కళకళలాడుతూనే ఉంటుంది. మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ అసలు ఎందుకు నిర్మించారు అనే విషయం చాలామందికి తెలియదు. అప్పట్లో దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమ అనగానే మద్రాస్ గుర్తుకు వచ్చేది. తెలుగు, తమిళ‌, కర్నాట, మలయాళ లాంటి ఎన్నో భాషలు సినిమాల్లో కేవలం మద్రాస్ కేంద్రంగానే నిర్మించేవారు. ప్రతి ఒక్కరూ సినిమా షూటింగ్ అంటే మద్రాస్ వెళ్లాల్సి వచ్చేది.

చిత్ర‌ పరిశ్రమకు సంబంధించిన పరిజ్ఞానం అంతా మద్రాస్ సినీ పరిశ్రమంలోనే ఉండడంతో సినీ రంగానికి సంబంధించిన చాలా మంది హీరోలు కూడా మద్రాస్ లోనే సొంత ఇళ్లను కూడా నిర్మించేసుకున్నారు. ఇక నాగేశ్వరరావు 1975లో అన్నపూర్ణ స్టూడియోస్ ను ప్రారంభించాడు. ఒకరు సినిమా తీస్తే స్టేట్ మొత్తంకి ఒక్కరే ఆ సినిమా కొనుకునేవారు. ఆ సినిమా ఎవరికి నచ్చితే వాళ్లు కొని రిలీజ్ చేసేవారు. దాని గురించి ముందుగానే అగ్రిమెంట్ అయిపోయేది. అప్పట్లో నవయుగ ఫిలిమ్స్ అనే ఓ పెద్ద బ్యానర్ ఉండేది. నవయుగ ఫిలిమ్స్ అంటే చాలా పెద్ద ప్రొడ్యూసర్ సోదరుల కుటుంబానికి చెందినవారు. విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ హీరోగా వచ్చిన దేవదాసు సినిమా నవయుగ ఫిలిమ్స్ వాళ్ళు కొని రిలీజ్ చేయాలనుకున్నారు.

నాగేశ్వరరావు దేవదాసు మూవీ కూడా అదే రోజు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అప్పటికే ఆ సినిమా మూడుసార్లు రిలీజై 100 రోజులు పైగా ఆడింది. దాదాపు సంవత్సరం ఆడిన ఆ సినిమాను మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని కృష్ణ గారికి దేవదాసు సినిమా వారానికి అటు ఇటుగా సినిమాను ఫిక్స్ చేసుకోండి అని నాగేశ్వరరావు నవయుగ బ్యానర్ వాళ్లు రిక్వెస్ట్ చేశారు. అయితే అక్కినేని దానికి అంగీకరించకుండా నేను ఆరోజునే రిలీజ్ చేస్తాను అని పట్టుబ‌ట్టారు. దీంతో నవయుగ వాళ్లకు కోపం వచ్చింది. సారథిస్టూడియోస్ నవయుగ సంస్థ వారి చేతిలో ఉండేది. నవయుగ ఫిలిం, సారథి స్టూడియోస్ వాళ్లంతా అన్నదమ్ములు దీంతో నాగేశ్వరరావు సినిమాలను సారథి స్టూడియోస్ బ్యాన్ చేశాయి.

ఇక‌ నాగేశ్వరావు మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు. నాగేశ్వర సినిమా షూటింగ్ కర్ణాటకలోని కంటిరవా స్టూడియో ఉండేది. కన్నడ కంటిర‌వ‌ రాజ్ కుమార్ స్టూడియోలో ఆయన షూటింగ్లన్ని జరిగాయి. ప్రతి షూటింగ్‌కి బెంగళూరు వెళ్లి రావడం ఇబ్బందిగా భావించిన అక్కినేని స్టూడియో కోసం వాళ్లని వీళ్ళని బతిమిలాడడం ఎందుకు.. అసలు నేనే ఓ స్టూడియో కడతాను అని ఫిక్సై రెండు సంవత్సరాలు పాటు చాలా శ్రద్ధ తీసుకొని ఒక నిర్మానుషమైన ప్రదేశాన్ని చదునుగా చేసి అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. మొత్తం 22 ఎకరాలు సువిశాలమైన ప్రదేశం. 1976 జనవరి 14న రాష్ట్రపతి ప్రకృద్దీన్ అలీ అహ్మద్ చేతుల మీదుగా అన్నపూర్ణ స్టూడియోస్ ని ప్రారంభించాడు. 11 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మొదటి అంతస్తు అప్పటికి పూర్తయింది. ఇలా సూపర్ స్టార్ కృష్ణ అయ‌న‌కు తెలియకుండానే అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించడానికి కారణం అయ్యారు.