అప్పుడే వరుణ్ ని కంట్రోల్ లో పెట్టిన లావణ్య.. మరో స్నేహా రెడ్డి లా అయిపోయిందే..!?

రీసెంట్ గానే హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆరేళ్లుగా గుట్టి చప్పుడు కాకుండా ప్రేమాయణం కొనసాగిస్తూ ఉన్న ఈ జంట ఫైనల్లి కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు , రీసెంట్గా వీళ్ళ పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది . రీసెంట్ గానే ఇండియా కూడా వచ్చారు . మరికొద్ది గంటల్లోనే హైదరాబాద్లోని మాదాపూర్ లో వీళ్ల రిసెప్షన్ గ్రాండ్గా జరగబోతుంది .

అయితే పెళ్లయిన మరోక్షణం నుంచే లావణ్య తన సెకండ్ షెడ్యూల్ చూపిస్తుందట . వరుణ్ ని టోటల్ గ్రిప్ లో పెట్టుకుంటూ ఆయన్ని కంట్రోల్ లో పెట్టేసుకుందట . వరుణ్ భార్య లావణ్య కోసం వరుణ్ తల్లి ఎంతో ఇష్టపడి ఒక లెహంగాను డిజైన్ చేయించిందట. అదే రిసెప్షన్ కి వేసుకోమంటూ లావణ్యని కోరగా అది ..కంఫర్టబుల్గా లేదు అని వేరే లాంగ్ ఫ్రాక్ తాను డిజైన్ చేసుకున్న డ్రెస్ నే వేసుకుంటాను అని భీష్మించుకొని కూర్చుందట .

దీంతో చేసేది ఏదీ లేక వరుణ్ తల్లి వెనక్కి తగ్గింది . అంతేకాదు వరుణ్ కూడా లావణ్య కి సపోర్ట్ చేశారట . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అప్పుడే వరుణ్ ని అంత కంట్రోల్ లో పెట్టేసుకుందా..? అంటుంటే మరికొందరు ఇది మరో స్నేహారెడ్డి లాగా తయారయింది.. బన్నీని కంట్రోల్లో పెట్టినట్టు లావణ్య కూడా వరుణ్ ని కొంగున కట్టేసుకోవాలని చూస్తుందా..? ఏంటి..? అంటూ పిచ్చిపిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు..!!