చిరంజీవి సినిమాలో బంపర్ ఆఫర్ దక్కించుకున్న ” పొలిమేర ” బ్యూటీ…!!

తాజాగా రిలీజ్ అయిన ” పొలిమేర 2 ” హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా మొదటి రోజు రూ.3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు రాబట్టింది. ఇక ఈ సినిమాలో సత్యం రాజేష్ కంటే కూడా ఫిమేల్ లేడీ రోల్లో నటించిన కామాక్షి భాస్కర్ల సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది.

అద్భుతమైన యాక్టింగ్ చేసిందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు కూడా. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్లు దక్కించుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ లిస్టులో స్టార్ హీరోల సినిమాలు సైతం ఉన్నాయట. చిరంజీవి, వశిష్ఠ దర్శకత్వంలో వచ్చే సినిమాలో ఒక కీల‌క‌ పాత్ర చేయనుందట ఈ బ్యూటీ.

ఇక దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు…” చిరు సినిమాలోని చాన్స్ కొట్టేసిందంటే ఈమె కెరీర్ లో తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు. ఒక్క సినిమాతో స్టార్ హీరోని పడగొట్టిందంటే మామూలు విషయం కాదు. రానున్న కాలంలో ఈమె పెద్ద సెలబ్రిటీ అయిపోతది ” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.