త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ నటి..!!

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా బుల్లితెర పైన తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి ప్రేరణ. ఈమె కన్నడ ప్రాంతానికి చెందిన అమ్మాయి. ఈ సీరియల్స్ లో నటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రలో ఒదిగిపోయి మరి ఆయా పాత్రలలో జీవిస్తూ ఉంటారు. ఇందులో ప్రేరణ పాత్ర చాలా మంచితనంగా అమాయకత్వంగా మొండితరంగా కనిపిస్తూ ఉంటుంది. హైదరాబాదులో పుట్టి పెరిగిన ప్రేరణ బెంగళూరులో పెరిగింది.

కన్నడ సీరియల్స్ లో నటిస్తూనే మంచి పాపులారిటీ అందుకున్న ప్రేరణ కృష్ణ ముకుందా మురారి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. అంతేకాకుండా తన తింగరితనంతో ఆకట్టుకున్న కృష్ణమ్మగా మంచి పాపులారిటీ అందుకుంది. ఈ సీరియల్ లో గగన్ తప్పుకోవడంతో సరికొత్త హీరో యాక్టర్ ఎంట్రి ఇచ్చారు. మరొకవైపు ప్రేరణ నిజజీవితంలో కూడా తన హీరోని అభిమానులకు పరిచయం చేయడం జరిగింది.. ప్రేరణ త్వరలోనే వివాహం చేసుకోబోతోందని ఇప్పటికే తనకు నచ్చిన మెచ్చిన వాడితో ఎంగేజ్మెంట్ అయిందని కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం జరిగింది.

ప్రేరణకు కాబోయే భర్త పేరు శ్రీపాద్ ఇద్దరు కలిసి ఉన్న కొన్ని ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. శ్రీపాద్ కూడా హీరోగా అనిపించేంత హ్యాండ్సమ్ గా ఉన్నప్పటికీ ప్రేరణ శ్రీపాద్ జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే అంతగా ఉందంటూ ఆమె అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రేరణకు అభిమానులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ తెగ వైరల్ గా చేస్తున్నారు. మరి వివాహమైన తర్వాత సీరియల్స్ లో నటిస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది.