మన డాక్టర్ బాబు సినిమాలలో అభివృద్ధి చెందకపోవడానికి అసలు కారణాలు ఇవే అట…!!

కార్తీకదీపం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన వారిలో నిరుపమ్ ఒకడు. ఈయన నటించిన సీరియల్ సన్నీ దాదాపు హిట్ టాక్ ని అందుకున్నాయి. ఈయన పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. తాజాగా నిరుపమ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. మీకు సినిమాల్లో ఎందుకు పెద్ద గుర్తింపు రాలేదు అని అడగగా… ఈయన షాకింగ్ కామెంట్స్ చేశాడు.

కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ లో నిత్యామీనన్ కి జోడిగా నటించాడు. అనంతరం సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో రెండు, మూడు సినిమాల కోసం ఆడిషన్స్ కూడా ఇచ్చాడట.” నేను సీరియల్స్ లో నటిస్తున్న అని నన్ను సినిమాలలో రిజెక్ట్ చేశారు. ఆ సమయంలో ఏడుపు రావడంతో నాన్న ఫోటో ముందు తెగ ఏడ్చేశాను. తండ్రి లేకపోవడం వల్ల సినిమాలకు సంబంధించి నన్ను న్యూ కమ్మర్ లా ట్రీట్ చేస్తున్నారు. నాకు సినిమా సర్కిల్ లేదు. అందువల్లే సినిమా ఆఫర్స్ కొరకు ఎవరి దగ్గరకు వెళ్ళలేదు ” అంటూ నిరుపమ్ పేర్కొన్నాడు.

నిరుపమ్ ఇంకా మాట్లాడుతూ ” అప్పట్లో ఇది బాధ కలిగించిన.. అనంతరం టీవీ రంగంలో హ్యాపీగా ఉన్నాను. ప్రస్తుతం సినిమా ఆఫర్లు వస్తున్నాయి… రాబోయే రోజుల్లో సినిమాలలో కనిపిస్తాను ” అంటూ నిరుపమ్ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు చూసిన ప్రేక్షకులు…” సీరియల్స్ లో దుమ్ము లేపేసాడు.. ఇక సినిమాలలోకి వెళ్తే తప్పకుండా సక్సెస్ అవుతాడు. అలాగే మా వంటలక్కని కూడా మీ సినిమాలో హీరోయిన్గా పెట్టుకోండి ” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.