ప్రస్తుతం ఉన్న కాలంలో మొబైల్ కూడా ప్రతి ఒక్కరికి ఒక భాగం అయిపోయింది. మొబైల్ లేకుండా మనం ఎలాంటి పని చేయలేము. ఎంటర్టైన్మెంట్ కోసం మొబైల్ ని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నాము ..ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు కూడా ఈ మొబైల్ తోనే ఎక్కువగా కాలక్షేపాన్ని చేస్తున్నారు ప్రజలు. రాత్రి సమయాలలో పడుకునే ముందు మొబైల్ ని ఎక్కువగా చూస్తూ ఉన్నారని ఒక నివేదికలో తెలియజేయడం జరిగింది.. అందులో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ,యూట్యూబ్ వంటి వాటిని ఎక్కువగా చూస్తున్నట్లు సమాచారం.
అయితే ఇలా మొబైల్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యానికి ముప్పు వస్తుందట. దీనివల్ల శరీరానికి కూడా చాలా దెబ్బతినేలా చేస్తుంది. మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ మన కళ్ళను చాలా దెబ్బతినేలా చేస్తుందట.అలాగే రాత్రి సమయాలలో మొబైల్ ని ఎక్కువగా చూస్తే నిద్ర కూడా పట్టదట. దీంతో చాలా ఒత్తిడికి సైతం గురవుతాము. మొబైల్ ని ఒకేచోట కూర్చొని చూస్తూ ఉండడం వల్ల చేతులు భుజాల కండరాల పైన తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
రాత్రి పడుకునే ముందు ప్రతి ఒక్కరూ కూడా నెట్ ఆఫ్ చేసుకుని పడుకోవడం మంచిది. దీని వల్ల రేడియేషన్ సమస్య పూర్తిగా తగ్గుతుంది.
అనవసరమైన సోషల్ మీడియా యాప్స్ ను డిలీట్ చేయడం వల్ల మొబైల్ ని వాడకం తగ్గిస్తారు. ముఖ్యంగా మొబైల్ స్క్రోల్ చేసేటప్పుడు బ్రైట్నెస్ ని పూర్తిగా తగ్గించడం మంచిది ఇలా తగ్గించడం వల్ల కళ్ళ పైన ఎక్కువగా ప్రభావం చూపదు.
మొబైల్ ని తరచూ ఎక్కువగా వాడడం వల్ల బానిసగా మారడమే కాకుండా చాలా ఒత్తిడికి గురవయ్యే అవకాశం ఉంటుంది.