మ‌మా మ‌హేష్ మాస్ అదిరింది.. గుంటూరు కారం సాంగ్ ప్రోమో ( వీడియో)

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో గుంటూరు కారం సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన మహేష్ మాస్ లుక్‌, గ్లింప్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మహేష్‌ని పక్కామాస్‌గా లాంచ్ చేస్తున్నట్లు ఈ సినిమా పోస్టర్లు చూస్తే అర్థమవుతుంది. త్రివిక్రమ్.. మహేష్ ను మాస్ హీరోగా ఎలివేట్ చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. రాజమౌళితో పాన్ ఇండియా టచ్ చేసే మహేష్ బాబుకు మొదట భారీ కమర్షియల్ సక్సెస్ ఇచ్చే చిత్రంగా గుంటూరు కారం ఉండబోతుందని ఫాన్స్ నమ్ముతున్నారు. త్రివిక్రమ్ కూడా అదే విధంగా స్టోరీ ని డిజైన్ చేశాడట.

టైటిల్ సహా ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమా పై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రోమో ని మూవీ టీం రిలీజ్ చేశారు. ప్రోమో మొత్తం ఎంతో ఆసక్తిగా కొనసాగింది. బ్యాక్ గ్రౌండ్ మాస్ బీట్లు అదరగొట్టేశాడు థ‌మ‌న్‌. ఎదురొచ్చే గాలి ఎగరేస్తున్న చొక్కా పై గుండి.. ఎగబడి ముందరకే వెళ్లిపోతది నేను ఎక్కిన బండి.. అంటూ ఫ్లోలో పాట ప్రోమో స్టార్ట్ అయింది. బ్యాగ్రౌండ్ లో మహేష్ ఎలివేషన్స్ అదిరిపోయాయి. గుంటూరు కారానికి మసాలా బిర్యాని ఘాటు తోడైతే ఎలా ఉంటుందో అంటూ.. సాగే సాంగ్ మహేష్ మాస్ యాంగిల్ హైలెట్ చేసింది.

కొన్ని సెకండ్లు బీట్ లతో మాస్ ఆడియన్స్ లో పూనకాలు తెప్పించాడు థ‌మన్. ఇక ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఈ సినిమాకి థ‌మన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో మహేష్ – థ‌మన్ కాంబినేషన్లో దూకుడు, బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాల్లో మ్యూజిక్ సంచలనం సృష్టించింది. తర్వాత థ‌మన్ పై నమ్మకంతో మహేష్.. ఆగడు సినిమాలో కూడా ఛాన్స్ ఇచ్చాడు. కానీ అది సక్సెస్ కాలేదు ఇంక‌ వీరిద్దరి కాంబినేషన్లో తర్వాత ఏ మూవీ రాలేదు. అప్పటినుంచి వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇదే. హారిక – హాసన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ల న‌టిస్తున్నారు.