రైతు బిడ్డ లో ఈ టాలెంట్ కూడా ఉందా..? పేరంట్స్ కి చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాడా..?

పల్లవి ప్రశాంత్ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . రైతుబిడ్డగా పాపులారిటీ సంపాదించుకున్న ఈయన సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీ కారణంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కు వన్ ఆఫ్ ద హౌస్మెట్గా ఎంట్రీ ఇచ్చారు . హౌస్ లోకి వెళ్ళిన మొదలు ఇప్పటివరకు ప్రశాంత్ పై సోషల్ మీడియాలో హ్యుజు రేంజ్ పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఎటువంటి సపోర్ట్ లేకుండా కష్టపడి పైకి ఎదిగిన పల్లవి ప్రశాంత్ ట్రోఫీ అందుకోవాలి అని .. సామాన్య జనాలు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే రైతుబిడ్డ జనాలను మోసం చేశాడు అన్న వార్త వైరల్ అవుతుంది . దానికి కారణం రీసెంట్గా సోషల్ మీడియాలో ఆయన పెళ్లి ఫోటో వైరల్ కావడమే . ప్రశాంత్ కు పెళ్లి అవ్వలేదు .

కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన పెళ్లికి సంబంధించిన ఫోటో వైరల్ అవుతుంది. అయితే ఇది కేవలం మార్ఫింగ్ చేసిన ఫోటో అని ఆయనకు పెళ్లి కాలేదు అని కుటుంబ సభ్యుల నుంచి క్లారిటీ వస్తుంది . కావాలనే ఎవరో ఆకతాయిలు ఈ విధంగా ఆయన పేరుని నెగిటివ్ గా ట్రోల్ చేసే విధంగా మార్ఫ్ చేశారని ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు..!!