అమ్మ బాబోయ్..ఆ విషయంలో డార్లింగ్ కూడా భయపడ్డాడా..? అందుకే అలా చేశాడా..?

ఎస్ .. ప్రభాస్ ఆ విషయంలో భయపడ్డాడా ..? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది . పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ ప్రెసెంట్ తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్ అన్ని పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కి రిలీజ్ అయ్యేలా చేసుకున్నాడు . అయితే మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మాత్రం లోకల్ గానే రిలీజ్ అవుతుంది.

ఈ సినిమాపై పెద్దగా బజ్  కూడా క్రియేట్ అవ్వలేదు.  అందుకే ఈ సినిమా ఎక్కడ ఫ్లాప్ అవుతుందో అన్న భయంతో ప్రభాస్ తన సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్ తానే లీక్ చేసుకున్నాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.  ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా రాజా డీలక్స్ . దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన రానప్పటికీ.. తెర వెనక మాత్రం షూటింగ్ చకచకా కంప్లీట్ చేసేస్తున్నారు .

రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఫైట్ సీన్ కి సంబంధించిన పిక్స్ నెట్టింట లీక్ అయి వైరల్ గా మారాయి . ఈ పిక్స్ లో డార్లింగ్ మహా మహా నాటీగా చాలా క్యూట్ గా కనిపిస్తున్నాడు . అయితే ఇది కావాలని ప్రభాసే తన సినిమాకి బజ్ ఏర్పడేలా క్రియేట్ చేయడానికి లీక్ చేసుకున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..!!