కత్తిలాంటి కాజల్ ను విలన్ గా మార్చేసిన డైరెక్టర్.. ఆ పాన్ ఇండియా సినిమా కోసమే..!?

టైం బాగోలేకపోతే ఎలాంటి నిర్ణయాలు అయినా .. ఎప్పుడైనా తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి . దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ కాజల్ అగర్వాల్ . టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచులు ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . కెరియర్ పిక్స్ లో ఉండగానే బిడ్డను కూడా కనేసింది. నీల్ కిచ్చులు తో లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది .

అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో పెద్దగా గ్లామర్స్ పాత్రలు రావడం లేదు .. వచ్చిన అరా కొరా కూడా ఎడిటింగ్లో ఆమె సీన్స్ లేపేస్తున్నారు. దీంతో కాజల్ ఇక బోల్డ్ స్టెప్ తీసుకోవాల్సిందే అంటూ ఏకంగా విలన్ రోల్స్ ను యాక్సెప్ట్ చేసిందట . ఇన్నాళ్లు గ్లామరస్ గా అందం పరంగా మెప్పించిన కాజల్.. ఇప్పుడు తనలోని నెగిటివ్ షేడ్స్ ని కూడా బయట పెట్టబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో ఆమె లేడీ విలన్ గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి ఈ రోల్ లో ఐశ్వర్య రాయిని చూస్ చేసుకున్నాడట జక్కన్న. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఆ పాత్రకు కాజల్ సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. ఆల్రెడీ కాజల్ జక్కన్న కాంబోలో మగధీర సినిమా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వీళ్ళ కాంబో సెట్ అవ్వడంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి..!!