నాచురల్ స్టార్ నాని ” హాయ్ నాన్న ” సినిమా ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్….!!

నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్గా యువ దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్, ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” హాయ్ నాన్న “. మరి నాని నుంచి జెర్సీ లాంటి క్లాసిక్ అనంతరం మళ్లీ ఫాదర్ సెంటిమెంట్ లో వస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమా పై ప్రేక్ష‌కులో మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు నాని ఫ్యాన్స్‌.

ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పుడు ఒకో సాంగ్‌ని రిలీజ్ చేయగా ఇక రెండో సాంగ్‌కి అయితే మేకర్స్ తీసుకున్న స్టెప్ ఇంట్రెస్టింగా ఉందనే చెప్పాలి. ఈ సినిమా సాంగ్‌ని శివ కార్తికేయన్, అలాగే కన్నడ నుంచి కిచ్చా సందీప్.. మన టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు దీనిని విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో తండ్రి కూతురు సెంటిమెంట్ కాగా ఈ పాట రిలీజ్ కూడా ఆ హీరోస్ తమ కూతుర్లతో కలిసి ఉన్న బ్యూటిఫుల్ పిక్స్ తో అనౌన్స్ చేశారు. దీనితో ఈ పర్టిక్యులర్ సాంగ్ విషయంలో మాత్రం మేకర్స్ వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు ఇంట్రెస్టింగ్ స్టెప్ ని తీసుకున్నారనే చెప్పాలి. ఇకముందు ఈ సినిమా ప్రమోషన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.