పుష్ప-2 సినిమాలో బోల్డ్ బ్యూటీ.. సుకుమార్ పై బన్నీ ఫ్యాన్స్ ఫైర్..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా పుష్ప2. పుష్ప వన్ సినిమాకి ఇది సిక్వెల్ గా తెరకెక్కుతుంది . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి .

కాగా ఈ సినిమాలో ఇప్పటికే చాలామంది క్యాస్ట్ క్రూ ను సెలెక్ట్ చేసుకున్నాడు సుకుమార్. అయితే ప్రతి చిన్న క్యారెక్టర్ ను చాలా పద్ధతిగా ఆలోచించి నిర్ణయం తీసుకునే సుకుమార్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న బ్యూటీని పుష్ప2లో ఓ రోల్ కోసం చూస్ చేసుకోవడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది .

బట్టలు విప్పేసి తిరిగే.. ఆ బ్యూటీ ఊర్ఫీ జావేద్ ని మా బన్నీ సినిమాలో ఎలా పెట్టుకుంటాం..? అంటూ సుకుమార్ పై బన్నీ ఫాన్స్ ఫైర్ అయిపోతున్నారు . దీంతో పుష్ప 2 సినిమాకి సంబంధించిన హ్య్స్ష్ ట్యాగ్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి..!!