హీరోగా అనిరుద్ రవిచంద్రన్ ఎంట్రీ.. దర్శకుడు ఎవరంటే..?

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్‌కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ప్రస్తుతం అందరి నోటా వినిపిస్తున్న పేరు అనిరుద్. పాటలతో పాటు ఆ రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొడతాడు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇలా ఓవైపు పాటలతో పిచ్చెక్కిస్తూనే.. మరోవైపు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో గూస్‌బ‌మ్స్‌ తెప్పిస్తుంటాడు. ఈ మధ్యకాలంలో అనిరుధ్ మ్యూజిక్‌కి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు.

ఇక తాజాగా అనిరుద్‌కు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అత‌డి ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ చేసుకుని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతున్నాయి. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ అనిరుద్ కోసం ఒక కథను రెడీ చేశాడట. అంతే కాదు లోకేష్ సినిమాలకు పనిచేసే స్టంట్ మాస్టర్లు, అన్బరవీలు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారట.

అన్ని కుదిరితే ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటివరకు రూమర్ గా మాత్రమే ఉన్న ఈ న్యూస్ నిజమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ మూవీలో అనిరుద్ మ్యూజిక్‌లా.. యాక్షన్ సీన్స్ కూడా వాయించి వదిలే విధంగా ప్లాన్ చేస్తున్నాడట లోకేష్. భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.