అమ్మ బాబోయ్‌.. `బిగ్ బాస్‌` మినీ లాంచ్ ఈవెంట్ లో నాగార్జున ధ‌రించిన ష‌ర్ట్ అంత కాస్ట్లీనా..?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 మోర్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. కొత్త కొత్త టాస్క్ లు, ట్విస్టులు, వైల్డ్ కార్డు ఎంట్రీలతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కి పోతోంది. గత నెలలో 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజ‌న్ 7.. తాజాగా ఐదు వారాలను కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికే హౌస్ లో నుంచి ఐదుగురు ఎలిమినేట్ కాగా.. అర్జున్, అశ్విని, భోలే షావలి, పూజా మూర్తి, నైని పావని మొత్తం ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు.

బిగ్ బాస్ 2.0 పేరుతో అక్టోబర్ 8న మినీ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించి.. కొత్త కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపారు. ఈ ఎపిసోడ్ అంద‌రికీ భ‌లే న‌చ్చేసింది. సిద్దార్థ్, రవితేజ లాంటి సెలబ్రెటీలు ఈ స్పెష‌ల్ ఎపిసోడ్‌లో సందడి చేశారు. అయితే బిగ్ బాస్ మినీ లాంచ్ ఈవెంట్ లో హోస్ట్ నాగార్జున ధరించిన షర్టు ధర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఖరీదైన వస్తువులు, దుస్తులతో నాగార్జున ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.

తాజాగా ఇదే మరోసారి రిపీట్ అయింది. లూయిస్‌ వ్యూటన్‌ బ్రాండ్‌కు చెందిన లాంగ్ స్లీవ్స్ కాట‌న్ లోగో ల‌గ్జ‌రీ ష‌ర్ట్ ను నాగార్జున తాజా ఎపిసోడ్ లో ధ‌రించాడు. చాలా క్లాసీగా ఉన్న ఈ ష‌ర్ట్ లో నాగార్జున సూప‌ర్ స్మార్ట్‌గా క‌నిపించారు. అయితే ఇంత‌కీ ఆ ధ‌ర కాస్ట్ ఎంతో తెలుసా.. అఖ‌రాల రూ. 2,23,495. అంటే రెండు ల‌క్ష‌లు పైమాటే. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు షాకైపోతున్నారు. అమ్మ బాబోయ్ నాగార్జున ఒక్క ష‌ర్ట్ కోసం అంత ఖ‌ర్చు పెట్టారా అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.