చిరంజీవి సినిమాలో శ్రీలీల..పాత్ర ఏంటో తెలిస్తే దండం పెట్టేస్తారు..వశిష్ట వండర్ ఫుల్ ప్లాన్..!!

వామ్మో..ఏంటి చిరంజీవి సినిమాలో శ్రీలీల ఆఫర్ అందుకునేసిందా..? ఇది నిజంగా ఎక్స్పెక్ట్ చేయని షాక్ .. ఇలాంటి కామెంట్స్ తోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలను ట్రెండ్ చేస్తున్నారు శ్రీ లీల అభిమానులు . రీసెంట్ గానే భగవంత్ కేసరిలో నటించి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న శ్రీ లీల.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన తన 156వ సినిమాలో కూడా కీలకపాత్ర కోసం చూస్ చేసుకున్నారట బెంబిసార డైరెక్టర్ వశిష్ట.

శ్రీలీలను ఈ సినిమాలో దేవత పాత్రలో చూపించబోతున్నాడట . ఒక గ్లామరస్ హీరోయిన్ ని దేవత పాత్రగా చూపించడం అంటే పెద్ద సాహసమనే చెప్పాలి . అయితే భగవంత్ కేసరిలో చాలా ట్రెడిషనల్ లుక్స్ లో ఆకట్టుకున్న శ్రీలీల ను చూసి వశిష్ట ఈ థాట్ వచ్చిందట .

వెంటనే శ్రీలీలకు కథ వివరించగా ఓకే చెప్పి సైన్ కూడా చేసేసిందట. అందరి హీరోలతో నటించిన శ్రీలీల చిరంజీవితో మాత్రమే నటించలేదన్న బెంగ ఉండేది. ఆ బెంగ కూడా తీర్చేయబోతుంది ఈ ముద్దుగుమ్మ.