డిజాస్టర్ టాక్ తో 100 రోజులు థియేటర్స్ లో ఆడిన ప్రభాస్ సినిమా ఇదే..

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలకు హిట్ టాక్ రాకపోయినా కలెక్షన్ల విషయంలో మాత్రం దూసుకుపోతున్నాడు. ఇక ప్ర‌స్తుతం ప్రతి వారం థియేటర్స్ కి ఎన్నో సినిమాలు వస్తున్నాయి. ఎంత హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా అయినా నెల రోజుల కంటే ఎక్కువగా ఆడడం లేదు. ఒకవేళ టాక్ అటు ఇటుగా ఉంటే వారానికి ఎత్తేస్తున్నారు. అలాంటిది గతంలో ప్రభాస్ హీరోగా నటించిన ఓ సినిమా డిజాస్టర్ టాక్‌ తెచ్చుకున్న థియేటర్స్ లో వంద రోజులు ఆడింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఒకసారి చూద్దాం.

Raghavendra (2003) - IMDb

ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ప్రభాస్ ఈ సినిమాతో సక్సెస్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాత రాఘవేంద్ర సినిమాలో యాక్ట్ చేశాడు. పోసాని కృష్ణ మురళి కథ అందించగా సురేష్ కృష్ణ ఈ సినిమాను రూపొందించాడు. ఇందులో ప్రభాస్ జోడిగా అన్ను, శ్వేత అగర్వాల్ నటించారు. ఆనంద్ రాజ్, మురళీమోహన్, ప్రభ, రామిరెడ్డి కీలకపాత్రలో నటించారు. బి. శ్రీనివాసరావు శ్రీశ్రీ బ్యానర్స్ పై ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. మణిశర్మ సంగీతం అందించారు. 2003 మార్చి 28 భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది.

Raghavendra Telugu Full Movie W/subtitles Prabhas Anshu Telugu Filmnagar |  chegos.pl

మొదటి షో తోనే నెగటివ్ టాక్ ను దక్కించుకున్న ఈ మూవీలో ప్రభాస్ నటన మాత్రం అద్భుతంగా ఉంది. కథ, స్క్రీన్ ప్లేలో ఉన్న లోపాల కారణంగానే సినిమా ఫ్లాప్ అయిందని చెప్పవచ్చు. దీంతో బాక్సాఫీస్ వద్ద రాఘవేంద్ర ఏ మాత్రం సత్తా చాటలేదు. అటు ప్రొడ్యూసర్లకు, ఇటు బయ్యర్లకు నష్టాలు మిగిల్చిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న కూడా.. నాలుగు కేంద్రాల్లో ఏకంగా వంద రోజులు ఆడింది. ఇది అప్పట్లో ఓ రికార్డు అనే చెప్పాలి. ఇక రాఘవేంద్ర సినిమా తర్వాత ప్రభాస్ వర్షం సినిమాలో నటించి భారీ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస‌ అవకాశాలను అందుకుంటు ఎన్నో హిట్ సినిమాల‌లో న‌టించి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.