అప్పుడు వైష్ణవి..ఇప్పుడు హారిక.. మొదటి సినిమాతోనే లిప్ లాక్ తో రెచ్చిపోయిందిగా..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పూర్తిగా మారిపోయింది. ఫామ్ ఉన్న బ్యూటీలే కాదు ఫామ్ లేని యూట్యూబర్స్ ని కూడా హైలెట్ చేస్తున్నారు కొందరు స్టార్స్. రీసెంట్ గానే ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య బేబీ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఒక్క సినిమాతోనే బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొట్టి దుమ్ము దులిపేసింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాం. అయితే తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది దేత్తడి హారిక . యూట్యూబ్ లో తెలంగాణ యాశ తో మాట్లాడుతూ పలు వీడియోస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న అలేఖ్య హారిక పలు సినిమాల్లో నటించిన హీరోయిన్ గా మాత్రం రాలేకపోయింది .

కాగా ఫస్ట్ టైం ఆమె హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీలో తెరపై కనిపించబోతుంది. అలేఖ్య హారిక హీరోయిన్ గా సంతోష్ శోభన్ హీరోగా సుమన్ పాతూరి అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో ఓ సినిమా పోతుంది . బేబీ నిర్మాత ఎస్ కే ఎన్ బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు, తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి .

ఈ క్రమంలోనే నాగచైతన్య చేతుల మీదగా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లోనే హీరో హీరోయిన్ల మధ్య లిప్ కిస్ ఇస్తున్న పోస్టర్ ను రిలీజ్ చేశారు . అలాగే ఈ పోస్టర్ మీద “కొన్ని ప్రేమకథలు జీవితకాలం వెంటాడుతాయి” అని రాశారు. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది . మొదటి పోస్టర్ ఇలా ఉంటే ఇక రానున్న సీన్స్ ఎలా ఉంటాయో అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. కొంతమంది ఇది పూర్తిగా బేబీ ఫార్మేట్ లోనే ముందుకు వెళ్తుందని ..వైష్ణవిలాగే దేత్తడి హారిక ఇందులో బోల్డ్ గా కనిపించబోతుంది అని లిప్ కిస్ రొమాన్స్ పుష్కలంగా ఈ సినిమాలో ఉంటాయి అని ఫస్ట్ పోస్టర్ టోనే అర్థం అయిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!