టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఎటువంటి సపోర్ట్ లేకుండా హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ కొట్టి ..నలిగి పెద్ద హీరోగా మారి పాన్ ఇండియా రేంజ్ హీరోలకు కూడా కాంపిటీషన్ ఇస్తున్నాడు అంటే దానికి కారణం ఆయన హార్డ్ వర్క్ అని చెప్పక తప్పదు . పెళ్లిచూపులు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ .. ఆ తర్వాత అర్జున్ రెడ్డి తో ఇండస్ట్రీని షేక్ చేసి పడేశాడు .
ప్రజెంట్ పలు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ రీసెంట్గా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్రీడాకోలా’ అనే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మెరిసారు . ఈ ఈవెంట్లో చాలా సరదాగా ముచ్చట్టించిన విజయ్.. స్టేజిపై ఎమోషనల్ కూడా అయ్యారు . అంతేకాదు పెళ్లిచూపులు లాంటి హిట్ సినిమాను అందించిన తరుణ్ భాస్కర్ తో త్వరలోనే మరో సినిమా రాబోతుంది అని హింట్ ఇచ్చాడు.
“కథను వివరించాడు అని గెట్ రెడీ అంటూ హింట్ ఇచ్చేశాడు”. దీంతో విజయ్ దేవరకొండ తో పెళ్లిచూపులు అనే సినిమా ఫినిష్ అయ్యింది అని.. ఇక త్వరలోనే పెళ్లి లాంటి ఓ సినిమాను ఆయన తెరకెక్కించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో ఇదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. రష్మిక హీరోయిన్ అయితే ఇంకా బాగుంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు..!!