“వాళ్లందరు వెధవలే”.. హీట్ పెంచేస్తున్న బాలయ్య మాటలు.. ఏమైందంటే..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక నెగెటివిటీ – ట్రోలింగ్ అనేది మరింత స్థాయిలో ఉంది . ఎలా అంటే ఓ మంచి మాట చెబితే దానిని కూడా చెడుగా ట్రీట్ చేస్తున్నారు. చెడుగా చూస్తూ మంచి చెప్పిన వాళ్లను ట్రోల్ల్ చేస్తున్నారు . రీసెంట్గా నందమూరి బాలయ్య భగవంత్ కేసరి అనే సినిమాలో నటించాడు . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది .

అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య చిన్నపిల్లలకు ఆడవాళ్లకు గుడ్ టచ్ అంటే ఏంటి ..?బ్యాడ్ టచ్ అంటే ఏంటి..? అంటూ క్లియర్ గా వివరిస్తారు.  అయితే సోషల్ మీడియాలో ఇవే కామెంట్స్ ని కొందరు ఆకతాయిలు ట్రోల్ చేస్తున్నారు . ఇన్ని నీతులు చెప్పిన నువ్వు శ్రీలీల తో  బిహేవ్ చేసిన పద్ధతి ఏంటి..? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు .

దీంతో నందమూరి ఫ్యాన్స్ సీరియస్ అయిపోతున్నారు. అలా మంచిని కూడా చెడుగా చూసేవాళ్ళు అందరూ వెధవలే అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఈరోజుల్లో చిన్నపిల్లలకి ఇది చాలా చాలా అవసరం అని ..అలాంటి మంచి మాటలు చెప్పిన బాలయ్యను కూడా ట్రోల్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నారు . దీంతో భగవంత్  కేసరి సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి..!!