బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: పుష్ప 2 లో చిరంజీవి.. అభిమానులకి మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ వచ్చేస్తుందోచ్..!!

వావ్ ..ఇది ఇలాంటి కాంబో కదా ఫాన్స్ కోరుకునేది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల్లో ఒకరుగా రాజ్యమేలేస్తున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన చిన్న అప్డేట్ రిలీజ్ అయిన ఫ్యాన్స్ బీభత్సమైన పూనకాలతో ఊగిపోతూ ఉంటారు.  రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఓ జబర్దస్త్ అప్డేట్ సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ గా మారింది.

పుష్పరాజ్ .. ఈ సినిమాలో చిరంజీవి డై హార్ట్ ఫ్యాన్  గా కనిపించబోతున్నాడట . అంతేకాదు చిరంజీవి సినిమాకి సంబంధించిన ఒక రెండు మూడు డైలాగ్స్ ను బన్నీ పుష్ప రాజ్ పాత్రలో చెప్పబోతున్నారట.  అంతేకాదు బంగారు కోడిపెట్ట సాంగ్ ఈ సినిమాలో రీమిక్  చేసి డాన్స్ చేసినట్లు ఓ న్యుస్ వైరల్ అవుతుంది .

అంతేకాకుండా  కొన్ని చిరంజీవి ఓల్డ్ సినిమా సీన్స్ ని కూడా ఈ సినిమాలో కొన్ని యాడ్ చేశారట. తెరపై బన్నీ చిరంజీవి డైలాగ్స్ చెప్తూ ఉంటే చూడడానికి రెండు కళ్ళు చాలవు అన్న కామెంట్స్ మేకర్స్ నుంచి వినిపిస్తుంది.  త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుందట . దీంతో పుష్ప2 సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ అయ్యింది..!!