రాష్ట్రపతి చేతుల మీదగా కాసేపట్లో అల్లు అర్జున్‌కు అవార్డు… వేయికళ్లతో ఎదురు చూస్తున్న బన్నీ ఫ్యాన్స్.‌.‌‌…!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హిస్టరీ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును అందుకోవడానికి నిన్న (అక్టోబర్ 16 ) తన భార్య స్నేహా రెడ్డితో కలిసి ఆనందంగా ఢిల్లీకి బయలుదేరారు.

ఈరోజు ( అక్టోబర్ 17 ) జరిగే జాతీయ అవార్డు సెర్మనీలో.. రాష్ట్రపతి చేతుల మీదగా బన్నీ అవార్డు అందుకోబోతున్నాడు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతోమంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం ” పుష్ప 2 ” సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్న కథానాయకగా నటిస్తుండగా.. సునీల్, ఫహల్ ఫాజిల్ విలన్ పాత్రల్లో అలరించనున్నారు.

ఇక ఈ సినిమా 2024 ఆగస్టు 15వ తేదీన గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మూడు నెలల ముందే ప్రారంభించనున్నారని గతంలో మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా పై బన్నీ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.