కీర్తి సురేష్ బర్తడే స్పెషల్… నెట్టింట వెలువగా మహానటి పుట్టినరోజు శుభాకాంక్షలు..!!

” మహానటి ” లాంటి హిస్టారికల్ సినిమాతో సూపర్ క్రేజ్ దక్కించుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. అలాగే అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ తో, సర్కారు వారు పాట సినిమాలో మహేష్ బాబుతో, భోళా శంకర్ సినిమాలో చిరంజీవితో నటించి ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. రామ్ పోతినేని హీరోగా వచ్చిన ” నేను శైలజ ” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తను మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుని స్టార్ హీరోయిన్గా ఇప్పటికీ రాణిస్తుంది.

మహానటి సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డును గెలుచుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లోనూ తన సత్తా చాటుకుంటుంది. ఒక్కో సినిమాకు దాదాపు కోటిన్నర వరకు పారితోషికం అందుకుంటుందని సమాచారం.

అయితే.. ఇదిలా ఉండగా.. నేడు (అక్టోబర్ 17) ఆమె పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా 1992లో అక్టోబర్ 17న మేనక దంపతులకు కీర్తి సురేష్ జన్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమె పుట్టినరోజు సందర్భంగా ఈమె పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది.