పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే.. శ్రీలీలను చూసి కృతిశెట్టి ఏం చేసిందో తెలుసా..?

పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అన్న సామెత మనం వినే ఉంటాం .. తరచూ మన ఇంట్లోని పెద్దవాళ్లు ..ఈ సామెతను వాడుతూ ఉంటారు. అయితే ప్రెసెంట్ ఈ సామెత కృతిశెట్టికి బాగా సెట్ అవుతుంది అంటున్నారు ఆమె అభిమానులు . అంతేకాదు ఆమె తీసుకునే నిర్ణయం చూస్తుంటే అది అచ్చుగుద్దినట్లు అలానే ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు .

శ్రీ లీల ఈ మధ్యకాలంలో ఎలా హిట్ ట్రాక్ లతో ఎలా దూసుకుపోతుందో చూస్తున్నాం. అదే వయసుగల కృతి శెట్టి మాత్రం ఫ్లాప్స్ తో అల్లకల్లోలంగా తన కెరీర్ ని మార్చుకుంటుంది. ఈ క్రమంలోనే శ్రీలీల హిట్ ట్రాక్ ను ఫాలో అవ్వడానికి శ్రీ లీల ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటే ఆమె కూడా అలాగే చూస్ చేసుకుంటుంది అన్న వార్త వైరల్ అవుతుంది.

భగవంత్ కేసరిలో బాలయ్యకు కూతురుగా నటించిన శ్రీ లీల ఎలా పాజిటివ్ కామెంట్స్ దక్కించుకుందో చూశాం. అయితే రీసెంట్ గా కృతి శెట్టి సైతం ఓ స్టార్ హీరోకి కూతురుగా నటించడానికి యాక్సెప్ట్ చేసిందట .కమలహాసన్ – నయనతార కాంబో మణిరత్నం ఓ సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కమల్ కి కూతురు పాత్రలో కృతశెట్టి కనిపించబోతుందట . పాత్ర చిన్నదే అయినా స్టార్ లు ఎక్కువగా ఉన్న మూవీ కావడంతో క్రేజ్ లభిస్తుంది అని ఈ నిర్ణయం తీసుకుందట . దీంతో ఇదే న్యూస్ వైరల్ చేస్తున్నారు అభిమానులు..!!