ఆ భయం నన్ను వెంటాడుతుంది అంటూ రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్..

రామ్ చరణ్ తేజ్ తన తండ్రి చిరంజీవి అడుగుజాడల్లో నడుస్తూ గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రముఖ తెలుగు నటుడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో ఖ్యాతి గడించిన సెల్ఫ్ మేడ్ యాక్టర్ చిరంజీవి. ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కొట్టి చాలామంది నటులకు ఇన్‌స్పిరేషన్ కూడా అయ్యాడు. తెలుగు తెరకు బ్రేక్ డ్యాన్సులు కూడా చిరునే నేర్పాడు.

రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన టాలెంట్, చరిష్మాతో తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. అతను తన తండ్రి విజయంతో సరిపెట్టుకోవడమే కాకుండా, పాన్-ఇండియా హీరోగా ఎదిగి దానిని అధిగమించాడు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించే చిత్రాల్లో నటించాడు. తండ్రిని మించిన కొడుకు అనే గౌరవం, అభిమానం సంపాదించుకున్నాడు.

రామ్ చరణ్ ఇప్పుడు పాన్-ఇండియా బ్లాక్ బస్టర్ హిట్స్ గా భావిస్తున్న పలు ప్రాజెక్ట్ లలో పని చేస్తున్నాడు. కెరీర్‌పై తనకు ఎలాంటి భయం లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎలాంటి ఎదురుదెబ్బలు, ఫెయిల్యూర్స్ లేదా వృద్ధాప్య సమస్యలు తనను భయపెట్టవని కూడా వెల్లడించాడు. ఎలాంటి సవాళ్లనైనా, ప్రశ్ననైనా ఎదుర్కొనేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పాడు.

అయినప్పటికీ, అతను తనను వేధించే ఒక భయం ఉందని ఒప్పుకున్నాడు. ఎంతో ఆనందంగా కలిసిమెలిసి ఉంటున్న కుటుంబ సభ్యులు విడిపోతారేమోననే భయం తనకు ఉందని చెప్పుకొచ్చాడు. తన కుటుంబమే తనకు పెద్ద బలం, ఆసరా అని చెప్పాడు. ఎందరో నటీనటులు, ప్రముఖులు ఉన్న మెగా ఫ్యామిలీలోని మెంబర్స్ చాలా సన్నిహితంగా ఉంటారు. ప్రతి పండుగను, శుభ సందర్భాన్ని కలిసి జరుపుకుంటారు.

చరణ్ ఇంకా మాట్లాడుతూ తన తండ్రి చిరంజీవి కుటుంబానికి మూలస్తంభమని అన్నారు. అందరినీ ఐక్యంగా, సంతోషంగా ఉంచిన ఘనత ఆయనదేనని కానీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే ఏదైనా ఘటన జరుగుతుందేమో అనే భయం ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నాడు. ఈ భయం తనను ఎప్పుడూ ఇబ్బంది పెడుతుందని చెప్పాడు.

తన కుటుంబానికి అన్నింటికంటే ఎక్కువ విలువ ఇస్తానని కూడా చెప్పాడు. పనిలో బిజీగా ఉంటే తప్ప, తన కుటుంబంలో ప్రతి ఫంక్షన్, ఈవెంట్‌కు హాజరు కావడానికి ప్రయత్నిస్తాడు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతానని చెప్పాడు.

ఇప్పటికే తన కజిన్ వరుణ్ తేజ్ పెళ్లి కోసం తన భార్య, కుమార్తెతో కలిసి ఇటలీ చేరుకున్నట్లు వెల్లడించాడు. మెగా ఫ్యామిలీ నుంచి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మరో నటుడు వరుణ్ తేజ్. రామ్ చరణ్ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నానని, వరుణ్ తేజ్ కొత్త ప్రయాణంలో శుభాకాంక్షలు తెలిపారు.