డార్లింగ్ ప్రభాస్ కి ఉన్న నికృష్టమైన అలవాటు ఇదే.. ఇప్పటికి మానలేదా..?

పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న రెబెల్ స్టార్ హీరో ప్రభాస్ కి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎలా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం . నిజానికి బాహుబలి సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ హీరో ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ అందుకోలేకపోయాడు. కానీ ఆయన క్రేజ్ రేంజ్ పబ్లిసిటీ పాపులారిటీ మాత్రం అదే స్థాయిలో ఉంది . ఇంచు కూడా తగ్గలేదు . మరీ ముఖ్యంగా ఈ హీరో పెళ్లి చేసుకుంటే చూడాలి అనేది కోట్లాదిమంది అభిమానుల కోరిక .

ఆ కోరిక కోరికగానే మిగిలిపోతుందో నెరవేరుతుందో ఆ దేవుడికే తెలియాలి . కాగ రీసెంట్గా ప్రభాస్ కి ఉన్న బ్యాడ్ హాబిట్ గురించి నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి . నిజానికి ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఫేస్ టు ఫేస్ మాట్లాడేవాళ్లు కానీ ప్రభాస్ కి మాత్రం ఆ గుణం లేదట . ఎవరైనా తనని హర్ట్ చేసిన ..బాధపెట్టిన తిరిగి వాళ్ళని ఒక మాట అనే ధైర్యం సాహసం కూడా చేయడట. ప్రభాస్ వాళ్ల గురించి లోలోపలే బాధపడతాడేమో కానీ నువ్వు చేసింది తప్పు అని తన ఫ్రెండ్స్ కి కానీ తనను బాధపెట్టిన వారికి కానీ ఇప్పటికే చెప్పడట .

అంతేకాదు మేకర్స్ సినిమాల విషయంలో కూడా ఒక విధంగా సీన్ చెప్పి మరొక విధంగా తెరకెక్కించిన చూసి చూడనట్టు వదిలేస్తాడే కానీ ఎక్కడ డిమాండ్ చేయడట . ప్రభాస్ కున్న మంచితనమే అందుకు కారణం అంటూ చెప్పుకొస్తుంటే కొందరు మాత్రం ఇది చాలా చెడ్డ అలవాటు అని.. దీని వల్ల ఫ్యూచర్లో ప్రభాస్ చాలా తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు..!!