ఇండస్ట్రీలో మరో పెళ్లి భాజా..కీరవాణి ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతున్న స్టార్ హీరో మనవరాలు..!

ఎస్ ..ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో పెళ్లి భాజా మొగ నుందా..? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. మరి కొద్ది రోజుల్లోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారు . దీనికి సంబంధించిన పనులన్నీ చకచకా కంప్లీట్ చేసుకుంటుంది మెగా ఫ్యామిలీ . ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో మరో బడా సెలబ్రిటీ పెళ్లి జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

ఆయన మరెవరో కాదు కీరవాణి కొడుకు శ్రీ సింహ . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కొడుకు శ్రీ సింహ పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది . అది కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మురళీమోహన్ మనవరాలని ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది.

కీరవాణి రెండో కొడుకు శ్రీ సింహ కి మురళీమోహన్ మనవరాలికి వివాహం జరగబోతున్నట్లు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ కోడై కూస్తుంది . వీళ్లిద్దరిది ప్రేమ వివాహం అంటూ ఓ న్యూస్ వైరలవుతుంది. అంతేకాదు వీళ్లు తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించుకొని మరి ఈ పెళ్లిని ఫిక్స్ చేసుకున్నారట. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అయితే దీనిపై అటు కీరవాణి కానీ ఇటు మురళీమోహన్ కుటుంబం కానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు . చూద్దాం మరి దీనిపై వీళ్ళు ఎలా స్పందిస్తారో..?