బిగ్ బాస్ షోలో మళ్లీ షాకింగ్ ఎలిమినేషన్. అలానే అందరూ ఊహించిన కంటెస్టెంట్ రీ ఎంట్రీ వచ్చింది. దసరా సందర్భంగా ఎపిసోడ్ ఓ రేంజ్ లో ప్లాన్ చేశారు. కానీ అది అలా అలా సాగింది. ఆటలు, పాటలు, కన్నీళ్లు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్ బయటకు వచ్చాయి. కానీ ఓ విషయమే ప్రేక్షకులకు గుండెల్లో గుణపంలా గుచ్చుకుంది. మళ్లీ మళ్లీ ఆలోచించేలా చేసింది. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత శోభ, యావర్ పెద్దగా ఏడవడం ఎవరూ చూడలేదు.
వీళ్లు అలా స్ట్రాంగ్ గా ఉండి ఆడుతున్నారు. ఆదివారం పెట్టిన గేమ్స్ లో గెలిచిన తరువాత ఇంటి నుంచి వీళ్లకు లెటర్స్ వచ్చాయి. తమ ఇంటి సభ్యులు తమ గురించి రాయడం. వాటిని వీళ్ళు చదువుతూ కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని ఎమోషనల్ చేసింది. నామినేషన్స్ నుంచి సేవ్ అవుతున్నప్పుడు తేజ కూడా నాన్నని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అలా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వీళ్లు ఎమోషనల్ కావడం డిసప్పాయింట్ గా అనిపించింది. దసరా ఎపిసోడ్ లో హీరోయిన్లు రెబా మోనికా జాన్, పాయల్ రాజ్ పుత్.. డ్యాన్స్ పర్ఫామెన్స్ లతో అదరగొట్టారు. యంగ్ సింగర్స్ వాగ్దేవి, లాలన, శిరీష పాటలతో అలరించారు. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా అమర్‌దీప్, అశ్విని, తేజ, గౌతమ్, ప్రశాంత్ వరసగా సేవ్ అయ్యారు.
పండగ కాబట్టి ఆయా కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులే వచ్చి సేవ్ చేస్తున్నట్లు వీడియో ప్లే చేసి సేవ్ చేశారు. పూజ, భోలె మిగలగా… పూజ ఎలిమినేట్ అయింది. మరోవైపు ఈ వారం లేడీ కంటెస్టెంట్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు రతిక. బిగ్ బాస్ లోకి తిరిగి అడుగు పెట్టింది. దీంతో రేపటినుండి ఈ షో మరింత రసవత్తంగా మారనుంది.