శ్రీలీలకి ఆ హీరో 2 కోట్లు ఇచ్చాడా..? ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీ లీలకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో నెట్టింట ఎలా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయో మనం వింటూనే ఉన్నాం ..చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా శ్రీ లీల ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా హిట్ అయిపోతుందన్న నమ్మకం మేకర్స్ కు బలంగా వచ్చేసింది .

దీంతో ఆల్మోస్ట్ ఆల్ అందరి హీరోలు స్టార్ హీరోలు సీనియర్ హీరోలు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఆమెనే తమ సినిమాలో హీరోయిన్గా పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .కాగా ఇలాంటి క్రమంలోనే ఓ స్టార్ హీరో సినిమా విషయంలో శ్రీ లీల ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. మామూలుగా ఆమె తీసుకునే రెండు కోట్ల రెమ్యూనరేషన్ ఏకంగా నాలుగు కోట్లు డిమాండ్ చేసిందట .

దీంతో ఆ మూవీ మేకర్స్ శ్రీ లీలను తప్పించాలని చూశారు. అయితే శ్రీలీల అంటే ఎంతో ఇష్టం గల హీరో నా రెమ్యూనరేషన్ లో రెండు కోట్లు తీసేసి ఆమెకే రెమ్యూనరేషన్ ఎక్కువ ఇవ్వండి.. కానీ నా సినిమాలో హీరోయిన్గా శ్రీ లీలానే పెట్టండి అంటూ శాక్రిఫైజ్ చేశాడట . దీంతో శ్రీలీల అంటే ఆ హీరోకి ఎంత ఇష్టమో అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!