నందమూరి ఫ్యామిలీ అలేఖ్యను చీట్ చేసిందా..? ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

ఎస్ ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు నందమూరి ఫ్యామిలీ అంటే పడని కొందరు జనాలు . ఇండస్ట్రీలో ఏం జరిగినా ..పొలిటికల్ నేపథ్యంలో ఏం జరిగినా ..అందరి కళ్ళు నందమూరి ఫ్యామిలీ పైనే పడుతూ ఉంటున్నాయి. రీసెంట్గా చంద్రబాబునాయుడు అరెస్టు అయితే ఎన్టీఆర్ స్పందించలేదు అంటూ చాలామంది జనాలు మండిపడ్డ విషయం తెలిసిందే . అంతే కాదు ఆ ఇష్యూ ని ఎక్కడికి ఎక్కడికో లాక్కో వెళ్లారు .

అయితే తాజాగా నందమూరి తారకరత్న భార్య అలేఖ్య సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మనకు తెలిసిందే తారకరత్న రీసెంట్ గానే మరణించారు . ఆయన మరణం అభిమానులకే కాదు సామాన్య జనాలకి సైతం జీర్ణించుకోలేని విషయంగా మారిపోయింది. ఈ క్రమంలోనే తన భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టింది .

 

 

“మన పిల్లల కోసం నేను ఇంకా ఇలా స్ట్రాంగ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. కానీ నా వల్ల కావడం లేదు ..నా వరకు నువ్వే నా బలం ..నువ్వు నాకు కావాలి అంటూ బాధపడిపోతూ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. ఒంటరిగా ఉన్న ఓటమిలో ఉన్న పైకి లేపేందుకు నువ్వు నాకు కావాలి ..నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన రోజు అంటూ వస్తుందని అనుకోలేదు ..నువ్వెప్పుడూ పైనుంచి నన్ను చూస్తూనే ఉంటావని నీకు తెలుసు ..నీకోసం నా గుండెల నుంచి రక్తం కారుతుంది బంగారు . ఇలాంటి గందరగోళంలో నువ్వు నా తోడు లేవని బాధగా ఉంది” అంటూ చాలా చాలా ఎమోషనల్ గా నోట్ రాసుకొచ్చింది.

 

అయితే నందమూరి ఫ్యామిలీ పట్టించుకోవట్లేదని .. అందుకే ఆమె ఇలా బాధపడిపోతుంది అని నందమూరి ఫ్యామిలీ ఆమెని పట్టించుకుంటే తారకరత్న లేడు అన్న బాధ నుంచి కొంచమైన బయటపడుతుంది అని చెప్పుకొస్తున్నారు . అయితే నందమూరి ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఎవరు ఆమెను దగ్గరికి తీసుకోవడం లేదని.. ఆమె బాగోగులు చూడడం లేదు అని .. అందుకే ఇంత ఎమోషనల్ గా మాట్లాడుతుంది అంటూ పలువురు జనాలు ఈ ఇష్యూ ని ఎక్కడికో లాగి లింక్ పెట్టి నందమూరి ఫ్యామిలీ ని ట్రోల్ చేస్తున్నారు..!!