భగవంత్ కేసరిలో శ్రీముఖీ వదులుకున్న పాత్ర ఇదే.. చేసుంటే కెవ్వుకేక..!!

బాలకృష్ణ తాజాగా నటించిన సినిమా భగవంత్ కేసరి . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అందుకోవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది . కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా నటించగా శ్రీ లీల కూతురు పాత్రలో కనిపించింది .

దీంతో సినిమాలో మంచి కంటెంట్ ఉండడంతో ఫాన్స్.. సామాన్య జనాలు సైతం ఈ సినిమాను హిట్ చేశారు . అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో యాంకర్ శ్రీముఖిని అనుకున్నారట అనిల్ రావిపూడి . అయితే ఆ పాత్రను ఆమె సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . సినిమాల్లో ఇంగ్లీష్ మాట్లాడే మంత్రి పాత్రలో రతిక కనిపించింది.

అయితే ఆ పాత్రలో శ్రీముఖిని అనుకున్నారట. కానీ ఆమెకు ఈ పాత్ర నచ్చక రిజెక్ట్ చేసింది. ఆమె ఈ పాత్ర చేసుంటే మాత్రం మరింత స్థాయిలో ఎంటర్టైనింగ్ గా ఉండేది అంటున్నారు అభిమానులు. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నింది శ్రీముఖి.. ఏం చేద్దాం టైం బ్యాడ్ అంటే ఇదే..!!