తెలుగు హీరో పై సీఎం కూతురు సెన్సేషనల్ కామెంట్స్..ఈ రేంజ్ రివ్యూ అస్సలు ఊహించలేదుగా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కేవలం సినిమా వాళ్ళే కాదు ..సామాన్య జనాలు సైతం పాపులారిటీ పబ్లిసిటీ సంపాదించుకుంటున్నారు. మరి ముఖ్యంగా కొంతమంది రాజకీయ నాయకులు సైతం సోషల్ మీడియాని ఎక్కువగా వాడుతున్నారు . ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట కవిత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది .

ఈ క్రమంలోనే ఆమె ఫ్యాన్స్ రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోల గురించి కూడా ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలోనే ఓ నెటిజెన్ ..”మేడం మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి..?” అంటూ అడగ్గా ..”డై హార్ట్ ఫ్యాన్” అంటూ ఆయనతో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది .

ఆ తర్వాత మరొక నెటిజన్..” మీకు ఫేవరెట్ హీరో ఎవరు అంటూ ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇస్తూ ఆల్వేస్ చిరంజీవి గారు ఫస్ట్.. ఆ తర్వాత అల్లు అర్జున్ తగ్గేదేలే అంటూ చెప్పుకొచ్చింది”. దీంతో సోషల్ మీడియాలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి చిరంజీవి-అల్లువ్ అర్జున్ అభిమానుల దిల్ ఖుష్ అయ్యే కామెంత్స్ చేసి వాళ్ల మనసులు దోచేసింది కవిత..!!