భర్త, కొడుకుతో కలిసి కొత్త ఇంట్లో అడుగుపెట్టిన కాజల్.. గృహప్రవేశం పిక్స్ వైరల్..

చందమామ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది కాజల్ అగర్వాల్. తర్వాత పలు సినిమాలో నటించిన రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆ తర్వాత స్టార్ హీరోలు అందరు సరసన నటించిన కాజల్ ఎన్నో హిట్ మూవీల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. 2020లో తన ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. తర్వాత కొడుకు (నీల్ కిచ్లు) పుట్టడంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మళ్లీ తాజాగా రీఎంట్రీ తో బాలకృష్ణ సరసన భగవంత్‌ కేసరిలో నటించింది.

దసరా కానుకగా థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో పెళ్లి సందడి ఫేమ్ శ్రీ లీల కీలక పాత్రలో నటించింది. ఇక ప్రస్తుతం రియంట్రీ తో వరుస సినిమాల్లో బిజీగా ఉన్న కాజల్ కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. భర్త, కుమారుడితో కలిసి గృహప్రవేశం చేసిన ఈ బ్యూటీ దానికి సంబంధించిన పిక్స్ ను తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాజల్ తన ఇన్స్టాలో స్టోరీ రాస్తూ నేను ఈ విషయాన్ని చాలా భావోద్వేగాలతో మీతో షేర్ చేసుకుంటున్నా.

మా పవిత్రమైన ఫ్యామిలీ కోసం ఈ వారంలోనే గృహప్రవేశానికి సంబంధించిన పూజ జరిగింది. ఈ ఇల్లు మేము ఎంతో ఇష్టంగా కట్టుకున్నాం. ఇది నేను ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఈ గుడ్ టైం లో మా హృదయాలు కృతజ్ఞతలతో నిండిపోయాయి అంటూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ తారలతో పాటు ఫ్యాన్స్ కూడా కాజల్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ పిక్స్ వైర‌ల్ కావ‌టంతో నీల్ కిచులు ఎంతో క్యూట్ గా ఉన్నాడు అంటూ.. బాబుకి దిష్టి తగులుతుంది కాజల్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్‌.