“నగ్నంగా వంగొ బెట్టి అలా చేశారు”..సిగ్గులేకుండా పచ్చిగా చెప్పిన స్టార్ హీరోయిన్ భర్త ..ఏమైందంటే..?

రెండేళ్ల క్రితం నటి శిల్పా శెట్టి భర్త.. రాజ్ కుంద్రా నీలిచిత్రాలు కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇది పెద్ద దుమారమే రేపింది. తాజాగా ఆ సంఘటన పంచుకున్న రాజ్ కుంద్ర సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈయన జైలుకెళ్లడంతో శిల్పా శెట్టి సైతం అనేక అవమానాలు ఎదుర్కొంది. రాజ్ కుంద్ర పై ఆరోపణలు ఈమెని చాలా ఇబ్బంది పెట్టాయి. దీంతో ఈమె బయటకు రావడమే మానేసింది. ఇటీవల కాలంలో మళ్లీ బయట కనిపిస్తుంది.

రాజ్ కుంద్ర జీవితం ఆధారంగా ” యూటీ69 ” పేరుతో ఓ సినిమాని కూడా తెరకెక్కిస్తున్నారు. ఇందులో తన జీవితంలోని బ్యాడ్ ఫేజ్ నీ చూపించబోతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా మూవీ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజ్ కుంద్ర ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…జైలు అనుభవాలను పంచుకున్నాడు. ” జైల్లో తను చాలా ఇబ్బంది పడినట్లు తెలిపారు. జైలుకి తీసుకెళ్లిన ఫస్ట్ డేనే దుస్తులన్నీ విప్పించి అందరి ముందు నగ్నంగా నిలబెట్టారట. తాను ఏదైనా నిషేధిత పదార్థాలు తీసుకొచ్చావా? అంటూ వంగోబెట్టి వెనుకభాగం చెక్ చేశారని తెలిపారు.

అలాంటి ట్రీట్మెంట్ చూశాక బతికున్న చచ్చినట్లే అనే ఫీలింగ్ కలిగిందని.. ఇన్నేళ్లు సంపాదించుకున్న పరువు, ప్రతిష్టలు మంటలో కలిసిపోయాయని.. తాను ఎంతో బాధపడినట్లు తెలిపారు రాజ్ కుంద్ర. జైల్లో తన పరిస్థితులు అలా ఉంటే బయట మీడియా కూడా నా గురించి ఏవేవో తప్పుడు కథలు ప్రచారం చేసి.. నగ్నంగా నిలబెట్టినంత పని చేశారన్నారు. ఇలా వరుస అవమానాలతో తాను ఎంతగానో కృంగిపోయినట్లు చెప్పారు. ఒకానొక దశలో జైల్లోనే చనిపోవాలనుకున్నానని.. కానీ ఏదో ఒక రోజు అసలు నిజం బయటకు వస్తుందని తనకు తాను ధైర్యం చెప్పుకున్నట్లు తెలిపారు రాజ్ కుంద్ర “.

తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే ఇటీవల పెద్ద బాంబు పేల్చాడు రాజ్ కుంద్ర. శిల్పా శెట్టితో తాను విడిపోనున్నట్లు ప్రకటించాడు. ఇద్దరం సపరేట్ అయ్యామని, తమకి ప్రైవసీ ఇవ్వాలని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది దుమారం రేపుతుంది. నిజంగానే శిల్పా శెట్టితో ఆయన విడిపోయారా? అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.