పెళ్లి పీటలెక్కాల్సిన శోభా శెట్టి.. మధ్యలోనే ఆగిపోవడానికి కారణం..?

శోభా శెట్టి అంటే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన తర్వాత బాగా పాపులారిటీ దక్కించుకుంది.. కానీ అంతకుముందు మోనిత క్యారెక్టర్ లో కార్తీకదీపం సీరియల్ లో తన విలనిజం చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈమె గురించి ప్రత్యేకంగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఎందుకంటే కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి పేరు దక్కించుకున్న ఈమె ఆ సీరియల్ కాస్త పూర్తవడంతో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పాల్గొని మరింత సందడి చేస్తోంది.

ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్ హౌస్ లో తన ఆట తీరుతో, మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటూ ఇక్కడ కూడా తన విలనిజాన్ని ప్రదర్శిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా.. బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ లో సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈమెకు సంబంధించి పెళ్లి వార్తలు బయటకు రావడం మరింత వైరల్ గా మారుతోంది.

ఇకపోతే గతంలో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియో పంచుకున్న ఈ ముద్దుగుమ్మ అందులో తనకు పెళ్లిచూపులు కాలేదు అంటూ కొన్ని విషయాలు పంచుకుంది. అయితే ఇప్పుడు ఆ వీడియోని మళ్లీ అభిమానులు షేర్ చేస్తూ ఆమెకు సంబంధించిన ఈ విషయాన్ని మళ్లీ వైరల్ గా మారుస్తున్నారు. ఇకపోతే తన తల్లి తన కోసం ఒక అబ్బాయిని చూసిందని, తన పుట్టినరోజు నాడు అతడిని చూస్తానని తెలిపిన ఈ ముద్దుగుమ్మ.. అయితే అతను తనకు సెట్ కాలేదని, అతడి అభిరుచులు ,తమ అభిరుచులు కాస్త భిన్నంగా ఉండడం వల్లే ఆ సంబంధం వదులుకున్నామని తెలిపి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇకపోతే పెళ్లి పీటలు ఎక్కాల్సిన శోభా శెట్టి ఇలా అతడి గురించి తెలుసుకొని మధ్యలోనే బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇకపోతే మరోవైపు కార్తీకదీపం సీరియల్ యశ్వంత్ తో ఈమె ప్రియమైన నడుపుతోందని వార్తలు వచ్చినా ఇందులో మాత్రం నిజం లేదని చెప్పవచ్చు.