ఈ మధ్యకాలంలో సినిమాలో హీరో కన్నా.. హీరోయిన్ కన్నా పక్కనుండే వాళ్ళ పాత్రలు .. చాలా హైలెట్ గా మారుతున్నాయి. అందుకే స్టార్ డైరెక్టర్స్ కూడా సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ని ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటున్నారు . మరీ ముఖ్యంగా అందులో కొరటాల శివ ది బెస్ట్ అనే చెప్పాలి. అందరూ డైరెక్టర్స్ హీరో హీరోయిన్ పై ఎక్కువగా కాన్సెంట్రేషన్ చేస్తూ ఉంటారు .
అయితే కొరటాల మాత్రం సినిమాలో తెరపై కనిపించే పని మనిషితో సహా పర్ఫెక్ట్ గా ఉండాలి అని .. అలాగే తన సినిమాలోని పాత్రలను డిజైన్ చేస్తారు. రీసెంట్గా కొరటాల శివ దేవర సినిమాలో స్టార్ హీరో అక్కను జాయిన్ చేసినట్లు తెలుస్తుంది . మంచు లక్ష్మి ఎన్టీఆర్ కు అక్క పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతుందట.
అంతేకాదు ఓవైపు పాజిటివ్ మరోవైపు నెగిటివ్ షేడ్స్ తో దుమ్ము దులిపేయబోతుందట . ఇన్నాళ్లు మంచు లక్ష్మి సినిమాలో నటించింది.. కనిపించింది..మెప్పించింది . అయితే పాన్ ఇండియా లెవెల్ లో ఇలాంటి సినిమా ఆఫర్ మాత్రం ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది..!!