క‌వ‌ర్ సాంగ్స్‌లో డ్యాన్స్ చేసి అల‌రించిన టాలీవుడ్ బ్యూటీస్ ఎవ‌రంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌లుగా పాపులారిటీ దక్కించుకున్న ఎంతోమంది ముద్దుగుమ్మలు సినిమాలోనే కాకా కవర్ సాంగ్స్ లోను డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలా వీడియో సింగిల్‌తో ఆకట్టుకున్న బ్యూటీస్ ఎవరో ఇప్పుడు చూద్దాం. మాస్టర్ మెషిన్ పేరుతో డిఫరెంట్ థీంతో ఓ ఇంటరెస్టింగ్ కవర్ సాంగ్ లో నటించింది మ‌ల్టి టాలెంటెడ్ బ్యూటి శృతిహాస‌న్‌. బుధవారం అర్ధరాత్రి రిలీజ్ అయిన ఈ సాంగ్ యూట్యూబ్ లో వైరల్‌గా మారింది. దీంతో శృతి లానే కవర్ సాంగ్ లో నటించిన నటినట్లులు ఎవరు అనే అంశం పై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.

మల్టీ టాస్క్లతో బిజీగా గడుపుతున్న రకుల్ ప్రీత్ సింగ్ తన బాయ్ ఫ్రెండ్ జాకీ భ‌గ్నాని మ్యూజిక్ కంపెనీ కోసం ఓ వీడియోస్ సింగిల్ కు డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. అలానే ఇటీవల గాంధారి గాంధారి అంటూ మాస్ స్టెప్పులతో రచ్చ చేసింది మహానటి కీర్తి సురేష్. ఇది సినిమాలో సాంగ్ అనుకున్నా తర్వాత ఇది వీడియో సింగిల్ అన్న క్లారిటీ వచ్చింది. అదేవిధంగా మిల్కీ బ్యూటీ తమన్న ప్రముఖ బాలీవుడ్ సింగర్ బాద్‌షాతో కలిసి రెట్రోపాండ యూనివర్సిటీలో తబాహీ అనే కవర్ సాంగ్లో నటించింది.

 

నేషనల్ క్ర‌ష్‌ రష్మిక మందన కూడా బాలీవుడ్ ఎంట్రీ కి ముందు హిందీ సింగిల్ లో ఆడి పాడింది. సౌత్, నార్త్ కాంబినేషన్లో టాప్ టక్కర్ సాంగ్‌లో చిందేసింది. ఈ వీడియో సింగిల్ బాలీవుడ్ ఎంట్రీ కి టీజర్‌ల‌ పని చేసింది. తెలుగులో అవకాశాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న వింగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ లడి లడి అనే మాస్ బీట్ సాంగ్ లో ఆమె స్వయంగా పాట పాడి మరీ చిందేసి ఆకట్టుకుంది.