Big boss 7: అర్జున్ అంబటి ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. ఇప్పటివరకు హౌస్ లో హైయెస్ట్ ఇదే..!!

అర్జున్ అంబటి .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. పలు సీరియల్స్ లో.. పలు రియాల్టీ షోస్ లో పాల్గొని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈయన ప్రజెంట్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. కాగ ఇప్పటివరకు ఉన్న కంటెస్టెంట్ లో అందరూ డమ్మీలని ..అర్జున్ అంబాటికే ట్రోఫీ విన్ అయ్యే ఛాన్స్ ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

దానికి మెయిన్ రీజన్ అర్జున్ అంబాటి కి ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ . అబ్బాయిల కన్నా సార్ కి అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. కాగా ఇప్పటివరకు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికన్నా అర్జున్ అంబటి ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది.

అందరూ 10000 – 15000 – 20,000 రోజుకి చార్జ్ చేస్తుంటే.. అర్జున్ అంబటి మాత్రం ఏకంగా రోజుకి 35000 ఛార్జ్ చేస్తున్నారట. ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ . ఆయన ఎన్ని రోజులు హౌస్ లో ఉంటే అన్ని 35000 ఆయన ఇంటికి వెళుతూ ఉంటాయి. దీంతో అర్జున్ అంబటి ఫైనల్ ట్రోఫీ అందుకుంటే భారీ స్థాయిలో వెనకేసుకోవచ్చు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఆయనకు ఓట్లు కూడా వేస్తున్నారు..!!