భార్యతో కలిసి ఫారన్‌లో ఎంజాయ్ చేస్తున్న బన్నీ.. పిక్స్ వైరల్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ మూవీ పుష్ప 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇటీవల భార్య స్నేహ రెడ్డితో కలిసి పారిస్‌లో సందడి చేశాడు. స్నేహ పుట్టినరోజు సందర్భంగా ప్యారిస్‌కు వెళ్లిన ఈ జంట అక్కడ ఎన్నో బ్యూటిఫుల్ పిక్స్ దిగారు. ప్రస్తుతం ఆ పిక్స్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇటీవల పారిస్ వెళ్లి వచ్చిన ఈ జంట అక్కడ వెకేషన్ లు ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను నెట్టింటే షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా అక్కడ వీధుల్లో, హోటల్స్‌లో, బస చేసిన రూమ్స్ లో బన్నీతో కలిసి స్నేహ దిగిన ఫొటోస్ ను ఇన్స్‌టా వేదికగా ఓ షార్ట్ అండ్ స్వీట్ టాగ్ తో స్నేహ షేర్ చేసుకుంది. పారిస్ ఇస్ జస్ట్ త్రి లెటర్స్ వర్డ్ ఆఫ్ పారడైస్.. అంటూ ఆమె ఫొటోస్‌కి ట్యాగ్ చేసింది.

ఈ ఫోటోలో బన్నీ బ్లాక్ టీ షర్ట్.. మ్యాచింగ్ జాకెట్, బ్లాక్ జీన్స్ తో ఆకట్టుకోగా.. స్నేహ బ్రౌన్ టాప్.. బ్లాక్ బ్రౌజర్ బ్లాక్ జాకెట్ తో ఫోజులిచ్చింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి దిగిన ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ సూపర్ క్యూట్ కపుల్ అంటూ.. వీరిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటూ పాజిటివ్ కామెంట్స్ తో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)