భగవంత్ కేసరి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్: తొందరపాటుతో టంగ్ స్లిప్ అయిన బాలయ్య..మీరు గమనించారా..?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య రీసెంట్గా నటించిన సినిమా భగవంత్ కేసరి . ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా ..యంగ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీ లీల ఆయనకు కూతురు పాత్రలో కనిపించబోతుంది . కాగా అక్టోబర్ 19న దసరా కానుకగా గ్రాండ్గా థియేటర్స్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న హనుమకొండలో ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్ .

స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాలయ్య మాస్ నెస్ ను బాగా చూపించాడు అనిల్ రావిపూడి. కాగా ఇదే క్రమంలో స్టేజ్ పైకి ఎక్కిన బాలయ్య మాట్లాడుతూ తన కొడుకు ఎంట్రీపై పరోక్షంగా టంగ్ స్లిప్ అయిపోయాడు. శ్రీ లీల గురించి ఓ రేంజ్ లో పొగిడేస్తూ ..ఈసారి శ్రీలీల తో హీరోయిన్ గా నటించాలనుకుంటున్నాను అని ఇంట్లో వాళ్లకు చెప్పానని..

దీంతో కోప్పడిపోయిన నా కొడుకు మోక్షజ్ఞ గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అంటూ మాట్లాడాడని .. నేను హీరోగా ఎంట్రీ ఇస్తున్నప్పుడు నా సినిమాలో ఆమెనే హీరోయిన్గా పెట్టుకుంటాను .. నువ్వెందుకు పెట్టుకుంటావ్ అంటూ కోప్పడ్డాడని.. పరోక్షంగా తన కొడుకు సినిమాలో హీరోయిన్ శ్రీ లీల అనే విషయాన్ని చెప్పేసాడు . చాలా ఆచితూచి మాట్లాడే బాలయ్య ఇలా టంగ్ స్లిప్ అవ్వడం వైరల్ గా మారింది. మొత్తానికి కొడుకు ఎంట్రీ పై ఫస్ట్ టైం టంగ్ స్లిప్ అయినా సరే చాలా పవర్ ఫుల్ గా స్పందించాడు బాలయ్య..!!