“కన్నప్ప” ప్రాజెక్ట్ లో మరో పాన్ ఇండియా హీరో.. ఇప్పుడు కదా సినిమాలో అసలు మజా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ హీరో గా పేరు సంపాదించుకున్న మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న డ్రీమ్ ప్రాజెక్ట్ “కన్నప్ప” . ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు మంచు విష్ణు . దీనికోసం స్పెషల్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు . గత నెలలో కాళహస్తిలో ఘనంగా పూజ కార్యక్రమాలు నిర్వహించి.. రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు .

ఈ సినిమాలో శివుడు రోల్ కోసం ప్రభాస్ పార్వతి దేవి రోల్ కోసం నయనతార ను చూస్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఈ సినిమాలో మరో మరికొందరు స్టార్స్ కూడా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది . కాగా తాజాగా ఇదే సినిమాలో కీలక పాత్రలో రానా దగ్గుబాటి నటించబోతున్నాడు అన్న ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది.

ఈ సినిమాల్లో మెయిన్ ఇంపార్టెంట్ లీడ్ పాత్ర కోసం రానా దగ్గుబాటిన చూస్ చేసుకున్నారట మంచు విష్ణు . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతుంది . అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఓ పాత్ర లో నటించబోతున్నట్లు తెలుస్తుంది . ఇంకా పలువురు స్టార్ సెలబ్రిటీస్ ని ఈ ప్రాజెక్టులో భాగం చేయనున్నాడు మంచు విష్ణు . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . మొత్తానికి మంచు విష్ణు హిట్ కొట్టేలానే ఉన్నాడు..!!