పవన్ సినిమాకి బన్నీ కొరియోగ్రాఫీ చేసాడనే విషయం మీకు తెలుసా..? ఆ సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఇదే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా ఆయన డాన్స్ స్టైల్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు జనాలు . కాగా పవన్ కళ్యాణ్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గుడుంబా శంకర్ మూవీలోని ఓ పాటకు అల్లు అర్జున్ కొరియోగ్రఫీ చేశాడు అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు . అందుకే ఈ న్యూస్ ని ఫ్యాన్స్ ని తెగ ట్రెండ్ చేస్తున్నారు . పవన్ కళ్యాణ్ కెరియర్ లో గుడుంబా శంకర్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది .అభిమానులు ఆయనను ఎలా చూడాలి అనుకున్నారో అదే విధంగా చూపించారు డైరెక్టర్ . అంతేకాదు మణిశర్మ సంగీతం సినిమాకి మరింత ప్లేస్ గా మారింది. ఈ సినిమాలో చిలకమ్మా అనే సాంగ్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

మరి ముఖ్యంగా కొరియోగ్రఫీలో స్టెప్స్ చాలా క్లాసిగా ఆహ్లాదకరంగా ఉంటాయి . అయితే ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసింది అల్లు అర్జున్ . పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అల్లు అర్జున్ డాన్స్ అంటే ప్రాణం. ఈ విషయం తెలుసుకున్న పవన్.. తన సినిమాలో అవకాశం ఇచ్చాడు . కొరియోగ్రఫీ ఎలా చేస్తారో అన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఇలా అవకాశం ఇస్తారట. ఈ సాంగ్ అప్పట్లో హైలైట్ గా మారింది. అందరికీ బాగా నచ్చేసింది..!!