శృతిహాసన్ తో చేయి కలిపిన కమల్ హ‌స‌న్‌.. ఇద్దరు కలిసి ఏం చేశారంటే..?

విశ్వనటుడు కమలహాసన్, ఆయన కూతురు శృతిహాసన్ వీరిద్దరికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. త్డ్రికి త‌గ్గ త‌న‌యురాలుగా శృతిహాసన్ నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా ఇలా మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ తండ్రి కూతుళ్ళు కాంబినేషన్లో సినిమా కోసం కోట్లాదిమంది ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ చాలాకాలం క్రితం మొదలైంది.

కానీ ఏవో రీజన్స్ చేత మధ్యలోనే ఆగిపోయింది. దీనితో వీరి అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక తాజాగా కమలహాసన్ – శృతిహాసన్ కలిసి ఒక మ్యూజిక్ ఆల్బ‌మ్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని శనివారం నాడు మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. శృతిహాసన్ కి మ్యూజిక్ ఆల్బమ్స్ ఏమి కొత్త కాదు. ఇప్పటికే రెండు మ్యూజిక్ ఆల్బమ్స్ చేసిన శృతిహాసన్ మూడవ ఆల్బమ్ తన తండ్రితో కలిసి చేయబోతోంది.

ఇటీవల దుబాయ్ సైమా అవార్డ్స్ వేడుకల్లో కమల్ హాసన్ ఈ ఆల్బమ్ గురించి మాట్లాడాడు. ఇక ప్రస్తుతం కమలహాసన్ తన 233వ‌ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరోపక్క బిగ్ బాస్ రియాల్టీ షోలో హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. శృతిహాసన్ కూడా సలార్ షూటింగ్ పూర్తచేసుకుంది. హీరో నాని హాయ్ నాన్న సినిమాలో నటిస్తుంది. తన తండ్రి కమలహాసన్ తో కలిసి రూపొందించిన ఈ మ్యూజిక్ ఆల్బమ్ గురించి వివరాలను త్వరలోనే వివరించమోతున్నట్లు ఆమె చెప్పింది.