“నా కూతురు నీకంటికి అలా కనిపిస్తుందా..?” తెలుగు డైరెక్టర్ తాట తీసేసిన బోనీకపూర్..ఏమైందంటే..?

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్నటువంటి బ్యూటీతో ఐటెం సాంగ్స్ చేయించడం సర్వసాధారణం . ఇప్పటికే మన ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోయిన్స్ అలా ఐటెం సాంగ్ చేసి పాపులారిటీ దక్కించుకున్నారు . క్రేజ్ కూడా దక్కించుకున్నారు. అయితే రీసెంట్గా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప2 సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఏకంగా ఆయన రిస్క్ చేసి మరి జాన్వి కపూర్ ని అప్రోచ్ అయ్యారట .

ఈ న్యూస్ గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే జాన్వి కపూర్ పుష్ప2 సినిమాలో ఐటెం సాంగ్ చేయడం లేదు అంటూ క్లారిటీకి వచ్చేసింది. ఇప్పుడిప్పుడే హీరోయిన్గా ఎదుగుతున్న జాన్వి కపూర్ కెరీర్ ని రిస్క్ లో పెట్టదలచుకోలేదు బోనీకపూర్ . అంతే కాదు నా కూతుర్ని చూస్తే నీకు ఐటం గర్ల్ గా కనిపిస్తుందా..? అంటూ సుకుమార్ పై ఫన్నీ గానే కూసింత ఘాటుగా కౌంటర్ వేశారట .

నిజానికి జాన్వికాపూర్ లాంటి హీరోయిన్ ఐటమ్ గర్ల్ గా చూపించే సాహసం ఎవరు చేయరు . ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తూ ఉంటే ..ఇంటికి వెళ్లి మరి ఐటం గర్ల్ నటిస్తారా ..? అనడం సమంజసం కాదు.. ఏ తండ్రి కైనా కోపం వస్తుంది. బోనీకపూర్ కాబట్టి కూసింత మర్యాదగానే ఘాటుగా ఆన్సర్ ఇచ్చి వదిలేసారు ..అదే వేరే హీరోయిన్ తండ్రి అయితే ఎలా ఆన్సర్ ఇచ్చేవాడో అందరికి తెలుసు అంటూ జాన్వి కపూర్ ఫ్యాన్స్ సుకుమార్ పై ఫైర్ అయిపోతున్నారు . ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!