అందరు చూస్తుండగానే మేడమ్ కాళ్లు మొక్కిన అసిస్టెంట్.. షాక్ అయిన రష్మిక ఏం చేసిందో చూడండి(వీడియో)..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ప్రజెంట్ ఎలాంటి టాప్ పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పేరుకు కన్నడ బ్యూటీనే అయిన తెలుగులో ఛలో అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి తన పేరుని మారు మ్రోగిపోయేలా చేసుకునింది . అంతేకాదు ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుని తనలోని టాలెంట్ ని బయటపెట్టిన రష్మిక మందన్నా.. ప్రజెంట్ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రి లో వరుసగా సినిమాల్లో నటిస్తూ క్రేజీ హీరోయిన్గామారిపోయింది.

రష్మిక ఎంత మంచి వ్యక్తి అనేది మనందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా నేటి కాలంలో హీరోయిన్స్ ఫోటోగ్రాఫ్ – ఆటోగ్రాఫ్ అంటూ వస్తే దూరం పెట్టేస్తూ నెట్టేస్తూ ఉంటారు . కానీ రష్మిక మందన్నా తన అభిమానులు ఎవరు అలా వచ్చిన సరే ప్రేమగా దగ్గరికి తీసుకొని సెల్ఫీ ఇచ్చి మరీ పంపిస్తుంది . అలాంటి రష్మిక మందన్నా కి సంబంధించిన లేటెస్ట్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. రష్మిక మందన్నా తన మేకప్ అసిస్టెంట్ సాయి వివాహానికి హాజరైంది. హైదరాబాద్లో జరిగిన ఆమె మేకప్ అసిస్టెంట్ సాయి పెళ్లికి రష్మిక మందన్నా చాలా సింపుల్ లుక్స్ లో వెళ్లి ఆకట్టుకునింది .

అంతేకాదు ఈ వేడుకకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది రష్మిక . ఇదే క్రమంలో రష్మికను చూసిన ఆమె మేకప్ అసిస్టెంట్ సాయి .. సతి సమేతంగా రష్మిక కాళ్ళకు మొక్కి ఆశీర్వదించమని కోరారు . దీంతో ఒక్కసారిగా అక్కడ ఉండే జనాలు షాక్ అయిపోయారు. రష్మిక సైతం అలాగే ఫీల్ అయింది. ఏం చేయాలో తెలియక తికమకగా బ్లెస్స్ చేస్తున్నట్లే బ్లెస్స్ చేసి షాక్ అయిపోయింది . ప్రెసెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే పెళ్లికాని 27 ఏళ్ల రష్మిక మందన్నా..ఆమె అసిస్టెంట్ ని దీవించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

నిజానికి తెలుగు సాంప్రదాయం ప్రకారం ఎవరైనా సరే పెద్ద వాళ్ళ కాళ్ళను చిన్నవాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు . కానీ రష్మిక మందన్నా చాలా చిన్నమ్మాయి . మరి ఎందుకు సాయి అలా ఆమె బ్లెస్సింగ్స్ తీసుకున్నాడా అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆమె ఆయనకు ఎంతో హెల్ప్ చేసి ఉండొచ్చని ..ఆమెను ఇంటి పెద్ద మనిషిల ట్రీట్ చేస్తున్నారని .. అందుకే ఇంటి పెద్ద దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి భార్యతో సహా ఆమె కాళ్ళపై ని మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి సోషల్ మీడియాలో రష్మిక మందన్నా ఆశీర్వదించిన వీడియో వైరల్ గా మారింది.!!