ఇంట్రెస్టింగ్: మార్చి 26 జూ.ఎన్టీఆర్ లైఫ్ లో మ‌ర్చిపోలేని రోజు..మోస్ట్ స్పెషల్ డే..ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా సరే.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే జనాలకు చాలా చాలా నచ్చుతుంది ..ఇష్టంగా లైక్ చేస్తూ ఉంటారు . దానికి రీజన్ ఆయన నటన . అంతేకాదు పెద్ద స్టార్ హీరో అనే గర్వం లేకుండా అభిమానులతో చాలా కూల్ గా చాలా సరదాగా మాట్లాడుతుంటారు . అంతే కాదు ఆయనకు ఇష్టం లేని పని చేస్తే కచ్చితంగా స్టేజ్ పైన ఇచ్చి పడేస్తారు. ఇప్పటికే అలాంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం . కాగా ప్రెసెంట్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మార్చి 26 ను అస్సలు మర్చిపోలేరు . అది ఆయన పుట్టిన రోజు కాదు ..కానీ అది ఆయన పుట్టిన రోజు కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ డే ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైఫ్ లో మార్చి 26 ఎప్పటికీ మర్చిపోలేనిది . ఎన్ని జన్మలెత్తినా సరే ఆ రోజున ఎన్టీఆర్ మర్చిపోలేరు .. మర్చిపోకూడదు ఆరోజు ఎన్టీఆర్ కు పునర్జన్మ కలిగించింది . మనకు తెలిసిందే ఎన్టీఆర్ గతంలో టిడిపి కోసం ప్రచారం చేసారు. 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తారక్ ఖమ్మం నుండి హైదరాబాద్ కు వస్తుండగా భారీ యాక్సిడెంట్ జరిగింది ఎన్టీఆర్ వాహనం మార్గమధ్యంలో యాక్సిడెంట్ కు గురైంది .

ఆ సమయంలో ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడ్డారు. తల-కుడి-భుజం మోచేతులు బాగా ఫ్యాక్చర్ అయిపోయాయి . లక్కీగా ఎన్టీఆర్ ఆ భారీ ప్రమాదం నుంచి సేఫ్ గా బయటపడ్డారు. అయితే అదే మార్చి 26 తన భార్య లక్ష్మీప్రతి పుట్టినరోజు కావడం గమనార్హం. యాక్సిడెంట్ తర్వాత తనకు పునర్జన్మ కలిగించిన ఆ రోజును తారక్ ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాడట. అందుకే మార్చి 26వ తేదీ తన పునర్జన్మ కలిగించిన రోజు అని ఎన్టీఆర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు . అంతేకాదు మార్చి 26వ తేదీ తమ ఇంట్లో రెండు పుట్టినరోజులు జరుగుతాయని ..ఒకటి తన భార్య లక్ష్మీ ప్రణతిది మరొకటి నాకు పునర్జనన కలిగించిన రోజు అని ..ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ గా స్పందించారు. ప్రజెంట్ తారక్ దేవర సినిమా షూట్ లో బిజీ బిజీగా ఉన్నాడు..!!