ఆ విషయంలో సుకుమార్ ని మించలేకపోతున్న రాజమౌళి..!!

టాలీవుడ్ లో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న డైరెక్టర్లలో రాజమౌళి, సుకుమార్ కూడా ఒకరు.. ఎప్పుడు సరికొత్త కదా అంశంతో ప్రేక్షకులను మెప్పించడానికి మక్కువ చూపుతూ ఉంటారు.. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన చాలామంది దర్శకులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకున్నారు. అయితే దిగ్గజ ధీరుడుగా పేరుపొందిన రాజమౌళి మాత్రం ఈ విషయంలో సుకుమారిన మించలేకపోయారని చెప్పవచ్చు.

Pushpa' director Sukumar hails Rajamouli for 'RRR' | Telugu Movie News -  Times of India

RRR , బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమాల ట్రెండ్ ని కొనసాగిస్తూనే ఉన్నారు రాజమౌళి. అయితే ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న తన శిష్యులను మాత్రం ఈ స్థాయిలో తీసుకెళ్లలేకపోతున్నారని వాదన ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.. రాజమౌళి దగ్గర నేర్చుకున్న శిష్యులంతా పెద్దగా సక్సెస్ లను అందుకోలేకపోతున్నారు.. అయితే సుకుమార్ అసిస్టెంట్లు మాత్రం దర్శకులుగా సక్సెస్ అవుతున్నారని చెప్పవచ్చు. ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు రూ.100 కోట్ల డైరెక్టర్ గా మారిపోయారు.. దసరా తో శ్రీకాంత్ ఓదెల కూడా మంచి సక్సెస్ను అందుకున్నారు.. గతంలో కుమారి 21ఎఫ్ చిత్రాన్ని తెరకెక్కించిన సూర్య ప్రతాప్ కూడా మంచి విజయాన్ని అందుకున్నారు.

ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్న రాజమౌళి శిష్యులు మాత్రం ఒక్కరు లేకపోవడంతో ఈ విషయం షాకింగ్ అని చెప్పవచ్చు.. అయితే రాజమౌళి శిష్యులలో గతంలో కరుణ కుమార్ నితిన్ తో కలిసి ద్రోణ అనే సినిమా అని తెరకెక్కించారు. ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది.ఆ తర్వాత రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.. జువ్వు, దిక్కులు చూడకు రామయ్య, త్రికోటి వంటి సినిమాలు చేశారు ఇవన్నీ ఫెయిల్యూర్ గా నిలిచాయి. రాజమౌళి స్కూల్ నుంచి వచ్చిన శిష్యులంతా ఫెయిల్యూర్ కావడంతో ఈ విషయంలో సుకుమార్ మాత్రమే సక్సెస్ అయ్యారు.