సాయి పల్లవికి తెలుగు హీరో అంటే అంత చులకనా..? అంత మాట అనేసింది ఏంటి..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవికి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు . ఎంతోమంది హీరోయిన్స్ అందాలను ఎక్స్పోజ్ చేసి ఆఫర్స్ అందుకుంటే ..కేవలం నటన చూపించే ఆఫర్స్ అందుకున్న హీరోయిన్గా సాయి పల్లవి రికార్డ్స్ క్రియేట్ చేసింది . అంతేకాదు అప్పటివరకు హీరోయిన్స్ అంటే కేవలం గ్లామరస్ కి అన్న బ్రమ నుంచి హీరోయిన్స్ సింగిల్ గా కూడా నటించగలరు అంటూ ప్రూవ్ చేసింది .

అయితే హీరోయిన్ సాయి పల్లవి కథ నచ్చకపోతే ఎలాంటి హీరోలనైనా రిజెక్ట్ చేస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలని అమ్మడు రిజెక్ట్ చేసింది . అంతేకాదు ప్రభాస్ – రామ్ చరణ్ – మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలను కూడా అమ్మడు రిజెక్ట్ చేసింది . అయితే అదే లిస్టులోకి వస్తాడు బాలకృష్ణ అంటూ కూడా తెలుస్తుంది.

మరి ముఖ్యంగా ఆయన సినిమాల్లో ఎటువంటి వల్గర్ కంటెంట్ లేకపోయినా సరే అమ్మడు ఈ సినిమాని రిజెక్ట్ చేయడం అభిమానులకు హర్టింగా అనిపించింది . బాలయ్య నటించిన వీరసిమ్హారెడ్డి సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన పాత్రలో ముందుగా సాయి పల్లవిని అనుకున్నారట మేకర్స్ . అయితే ఈ పాత్ర ఆమెకు చెప్పగా ఇది చాలా మాస్ అని తన బాడీకి సూట్ అవ్వదని చెప్పుకొచ్చింది అంటూ తెలుస్తుంది. అలా మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నింది సాయి పల్లవి..!!