వివాదంలో చిక్కుకున్న నాగార్జున ఫ్యామిలీ.. ఏం జరిగిందంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో వివాదాలకు సైతం దూరంగా ఉండే కుటుంబాలలో అక్కినేని కుటుంబం కూడా ఒకటని చెప్పవచ్చు. అయితే తాజాగా ఇప్పుడు ఈ కుటుంబం వివాదంలో నిలుస్తోంది. అక్కినేని నాగార్జున ప్రస్తుతం సక్సెస్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆయన కుమారులు కూడా సరైన సక్సెస్ అందుకోలేక చాలా సతమతమవుతున్నారు. తమకంటే యంగ్ హీరోలు సైతం పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతూ ఉంటే .. భారీ బ్యాగ్రౌండ్ ఉన్న నాగ్ ఫ్యామిలీ మాత్రం పాన్ ఇండియా కాదు కదా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడంలో సతమతమవుతున్నారు.

Nagarjuna's Sister Naga Susheela Lodges Police Complaint

తాజాగా నాగార్జున ఫ్యామిలీ వివాదంలో చిక్కుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. నాగార్జున సోదరి నాగసుశీల పై పోలీస్ కేసు నమోదు అయినట్టుగా తెలుస్తోంది.. అసలు విషయంలోకి వెళితే శ్రీజ ప్రకృతి ధర్మపీఠం ఆశ్రమం పైన ఈ నెల 12వ తేదీన నాగసుశీల కొంతమందితో వెళ్లి దాడికి పాల్పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ధర్మపీఠ నిర్వహకులు శ్రీనివాసరావు పైన ఈ దాడి జరిగినట్టుగా ఆయన మైనా బాద్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Real life brothers and sisters in T-Town

దీంతో బాధితుల మేరకు పోలీస్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. గతంలో నాగసుశీల తన వ్యాపారం భాగస్వామ్యం పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది.తమకు తెలియకుండానే తమ భూమిని విక్రయించేందుకు ప్రముఖ నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు పైన పోలీస్ స్టేషన్లో నాగసుశీల ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది .నాగసుశీల, శ్రీనివాసరావు చాలా సంవత్సరాల నుంచి వ్యాపారాలలో రియల్ ఎస్టేట్లో కూడా భాగస్వాములుగా ఉన్నారు. అయితే వీరిద్దరూ సుశాంత్ తో హీరోగా పలు సినిమాలు తెరకెక్కించడంతో ఇవన్నీ ఫ్లాపుగా నిలిచాయి. అయితే అప్పటికే భూమి బాధంలో ఉన్న వీరు మనస్పర్ధలు రావడంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగింది.. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరొకసారి వివాదాలలో నిలుస్తోంది నాగార్జున ఫ్యామిలీ.